ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు కీలక బాధ్యతలు.. కసరత్తు చేస్తున్న ప్రభుత్వం

by Disha Web Desk 4 |
ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు కీలక బాధ్యతలు.. కసరత్తు చేస్తున్న ప్రభుత్వం
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఇంటర్, డిగ్రీ కళాశాల్లో వున్నా ఎన్‌ఎస్ ఎస్ (నేషనల్ సర్వీస్ స్కీమ్) లో వాలంటరీలకు ఇక నుండి కొత్త బాధ్యతలను అప్పగించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పలు అంశాలపై శిక్షణ ఇచ్చేందుకు కసరత్తు మొదలు పెట్టింది. రాష్టంలో ప్రస్తుతం ముఖ్య పట్టణాలు, మున్సిపాలిటీలలో ప్రజలు ట్రాఫిక్ సమస్యలతో సతమవుతున్నారు. దీనికి తోడు మహిళలు ఎదురుకొంటున్న పలు సమస్యలపై వాలంటరీలకు శిక్షణా ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ముఖ్యంగా వాలంటరీలకు.. మహిళలపై వేధింపులు నివారణ, షీ టీమ్స్, బాలికల సమస్యలపై శిక్షణ ఇచ్చి వీరి సేవలను ఉపయోగించుకోవాలని పోలీసు శాఖ భావిస్తోంది.

ఈ మేరకు పోలీసు శాఖ ఉన్నతాధికారులు, ఎన్ఎస్ఎస్ రాష్ట్ర కో ఆర్డినేటర్‌తో కలిసి ఈ అంశాలపై చర్చించినట్టు సమాచారం. ప్రతిరోజు పోలీసు శాఖకు ఈ సమస్యలపై నిత్యం అధిక ఫిర్యాదులు రావడం, వాటిపై మహిళలు, బాలికలు , ప్రజల్లో మరింత అవగాహన పెంచి ఆ సమస్యలను అరికట్టేందుకు గాను ఎన్ఎస్ఎస్ వాలంటరీల సహకారంతో పరిష్కరించేందుకు వీరి సేవలను వాడుకోవాలని ప్రభుత్వం కుడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలిసింది. రాష్టంలో ఇంటర్, డిగ్రీ కళాశాలల్లో సుమారు లక్ష యాభై వేలు ఎన్ఎస్ఎస్ వాలంటరీలు వున్నారు. వీరి సేవలను ఉపయోగించుకోవడం మూలాన గ్రామా, పట్టణ, మున్సిపల్ ఏరియాల్లో కొంతమేరకైనా ఈ సమస్యలకు కాస్తా ఉపశమనంతో పాటు ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించడం మూలాన కేసులు తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.



Next Story

Most Viewed