తెలంగాణ సాహిత్య సభలో MLC కవిత కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 2 |
తెలంగాణ సాహిత్య సభలో MLC కవిత కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ అమరవీరులపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమరులను అవమానించే సంస్కృతి మాది కాదని వారిని పూజించుకునే సంస్కృతి తమది అన్నారు. గురువారం అబిడ్స్‌లోని తెలంగాణ సారస్వత పరిషత్‌లో భారత జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ సాహిత్య సభలో ఆమె పాల్గొని మాట్లాడారు. తెలంగాణ చరిత్రలో నేడు సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజు అని, ట్యాంక్ బండ్ వద్ద అమర వీరుల స్థూపాన్ని ఆవిష్కరించుకుంటున్నామని చెప్పారు.

కొన్ని పత్రికలు ఇప్పటికీ సమైక్య రాష్ట్రంలో అవలంభించిన విధానాలనే పాటిస్తూ ప్రతిక్షణం విషం చిమ్ముతూనే ఉన్నాయని ఆరోపించారు. కొన్ని పత్రికలు ఇక్కడి జ్యోతులు కావంటూ ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. జాగృతి తరపున ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించబోతున్నట్లు ప్రకటించారు. తెలంగాణ కవులు, కళాకారుల కోసం ప్రాజెక్టు కేసీఆర్, మహిళల కోసం ఫస్ట్ ఉమెన్, బై ఉమెన్ కార్యక్రమం, పాఠశాలల్లో పిల్లలకు సాహిత్యం మీద పట్టుకోసం ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించాలని ఈ సభల్లో నిర్ణయించారు.

Also Read..

YSRTP విలీనం వార్తల వేళ ఆసక్తికర పరిణామం

Next Story

Most Viewed