కేసీఆర్ ప్రభుత్వం కూలడానికి ప్రధాన కారణం అదే.. కుండబద్దలు కొట్టిన వీహెచ్

by GSrikanth |
కేసీఆర్ ప్రభుత్వం కూలడానికి ప్రధాన కారణం అదే.. కుండబద్దలు కొట్టిన వీహెచ్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీ.హనుమంతరావు హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం వీహెచ్ మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ చేసిన తప్పులు పునరావృతం కాకుండా ఆరు గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తామని చెప్పారు. అశ్రద్ధ, అహంకారం, నియంత పోకడల వల్లే కేసీఆర్ ప్రభుత్వం కూలిపోయిందని అభిప్రాయపడ్డారు. రెండుసార్లు మోసపోయిన రాష్ట్ర ప్రజలు మూడోసారి కేసీఆర్‌కు బుద్ధిచెప్పారని అన్నారు.

ఇచ్చిన హామీలను అమలులో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని తెలిపారు. కాళేశ్వరం కట్టామంటూ గొప్పలకు పోయి వేల కోట్లు దండుకున్నారని ఆరోపించారు. రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు ఇలా అందరూ కేసీఆర్ ప్రభుత్వంలో మోసపోయారని అన్నారు. టీఎస్‌పీఎస్‌సీ నిర్లక్ష్యం వల్ల వేలాది మంది విద్యార్థులు రోడ్డున పడ్డారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ బోర్డును ప్రక్షాళన చేసి నిరుద్యోగోలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. సీఎంగా రేవంత్ సరైన వ్యక్తేనని, అన్ని గుణగణాలు చూసాకే హైకమాండ్ రేవంత్‌ను ఎంపిక చేసిందని, మంత్రుల ఎంపిక కూడా బావుందని అన్నారు.

Next Story

Most Viewed