BRS కేడర్‌లో జోష్ పెంచే కేసీఆర్ వ్యూహం

by Disha Web Desk |
BRS కేడర్‌లో జోష్ పెంచే కేసీఆర్ వ్యూహం
X

దిశ, తెలంగాణ బ్యూరో : పరేడ్ గ్రౌండ్స్ లో బీఆర్ఎస్ సభ ఏర్పాట్లపై అధిష్టానం దృష్టిసారించింది. రెండులక్షల మందికిపైగా నిర్వహించేలా ప్లాన్ చేస్తుంది. బీజేపీ నిర్వహించే సభకు వచ్చే జనం కంటే రెండింతలు ఎక్కువ వచ్చేలా ప్రణాళికలు రూపొందించారు. జనసమీకరణ బాధ్యతలను గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు, మంత్రులకు అప్పగించారు. సభను భారీ సక్సెస్ చేసి కేడర్ లో జోష్ నింపనున్నారు.

హైదరాబాద్‌లో భారీ బహిరంగసభను వచ్చే నెల 17న పరేడ్ గ్రౌండ్స్ లో బీఆర్ఎస్ నిర్వహించనుంది. ఈ సభను గ్రేటర్ లో ఇంతవరకు ఏ పార్టీ నిర్వహించని విధంగా రెండులక్షల మందితో నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించింది. ఫిబ్రవరి 13న బీజేపీ సైతం నిర్వహిస్తున్న సభకు మోడీ హాజరవుతున్నారు. ఆ సభకు బీజేపీ తరలించే జనంకు మించి రెండింతలు తరలించాలని ఇప్పటికే పార్టీ నేతలకు అధినేత కేసీఆర్ సూచించినట్లు సమాచారం. బీఆర్ఎస్ తో దేశరాజకీయాలపై ఫోకస్ పెట్టిన కేసీఆర్... బీజేపీపై, మోడీపై ఇప్పటికే విమర్శలు ఎక్కుపెట్టారు. ఫెయిల్యూర్స్ ను ఎప్పటికప్పుడు ఎత్తిచూపుతున్నారు. ఏ చిన్న అవకాశం వచ్చినా విమర్శలు చేస్తున్నారు. ఈ తరుణంలో మోడీ సభలో ఏం మాట్లాడతారో చూసి దానిపై కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 24 నియోజకవర్గాలు ఉండటంతో అన్ని నియోజకవర్గాల నుంచి భారీగా జనసమీకరణ చేయాలని నగర పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులకు కేసీఆర్ బాధ్యతలు అప్పగించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం.

బలప్రదర్శనే మెయిన్ ఎజెండాగా బీఆర్ఎస్ సభ నిర్వహిస్తుంది. మరోవైపు రాబోయే ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో సత్తా చాటేందుకు ఈ సభ నాంది కావాలని పార్టీ భావిస్తుంది. అందుకు తగిన విధంగా జనసమీకరణ చేయాలని భావిస్తుంది. పార్టీ శ్రేణులకు అధిష్టానం ఎలాంటి ప్రోగ్రాం ఇవ్వకపోవడంతో కొంత స్తబ్దత ఏర్పడింది. ఈ సభతోపార్టీ చేసిన డెవలప్ మెంట్, సంక్షేమ పథకాలు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వివరించి పార్టీ శ్రేణుల్లో జోష్ పెంచాలని భావిస్తుంది. ఈసభలో కేంద్రంపైనే కేసీఆర్ విమర్శలు గుప్పించే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం..

Also Read...BRS

నేడు సెక్రటేరియట్‌లో హై లెవల్ కమిటీ మీటింగ్



Next Story