BRS విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 19 |
BRS విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ భవన్‌లో గులాబీ బాస్ కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రారంభమైన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం ముగిసింది. ఈ భేటీకి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, ఇతర కీలక నేతలు హాజరయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యుహాలు, ప్రచార శైలిపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ఉద్యమ కాలం నాటి కేసీఆర్‌ను మళ్ళీ చూస్తారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే కాంగ్రెస్‌పై తీవ్ర వ్యతిరేకత ప్రారంభం అయ్యిందని.. రానున్న రోజులు మనవేనని నేతల్లో భరోసా నింపారు. మరో ఐదేళ్లలో మనమే గెలుస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల గెలుపుకు అందరూ కృషి చేయాలని.. పార్లమెంట్‌లో మన గళం వినిపించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను చేపట్టబోయే బస్సు యాత్ర రూట్ మ్యాప్ ఇవాళ ఖరారు అవుతుందని స్పష్టం చేశారు. అనంతరం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులకు ఎన్నికల ఖర్చుల నిమిత్తం రూ.95 లక్షల చెక్కులను అందించారు.

Next Story

Most Viewed