KCRకు గాయం.. పవన్ కల్యాణ్ రియాక్షన్ ఇదే..!

by Disha Web Desk 4 |
KCRకు గాయం.. పవన్ కల్యాణ్ రియాక్షన్ ఇదే..!
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ చీఫ్, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం అర్ధరాత్రి ఆయన ఫాంహౌజ్‌లోని బాత్రూమ్‌లో కాలు జారి పడిపోయారు. దీంతో తుంటి ఎముక విరిగినట్లు వైద్యులు ప్రకటించారు. ఇదే అంశంపై టాలీవుడ్ అగ్ర హీరో, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కేసీఆర్ సంపూర్ణంగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఎన్నో సవాళ్లను అధిగమించిన ఆయన ఈ అనారోగ్య పరిస్థితులను మనోధైర్యంగా అధిగమిస్తారనే నమ్మకం ఉంది. పూర్తి ఆరోగ్యంతో మళ్లీ ప్రజలకు, సమాజానికి తన సేవలు కొనసాగిస్తారని ఆకాంక్షిస్తున్నాను.’ అన్నారు.Next Story

Most Viewed