కేసీఆర్ కాన్వాయ్ సీక్రెట్ ముందే చెప్పిన ‘దిశ’

by Disha Web Desk 2 |
కేసీఆర్ కాన్వాయ్ సీక్రెట్ ముందే చెప్పిన ‘దిశ’
X

దిశ, డైనమిక్ బ్యూరో: గత ముఖ్యమంత్రి కేసీఆర్ మూడోసారి తానే అధికారంలోకి వస్తానని తన కాన్వాయ్ కోసం రూ.66 కోట్లతో 22 ల్యాండ్ క్రూయిజర్లు కొనుగోలు చేసి వాటిని విజయవాడలో దాచిపెట్టారని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో సంచలనంగా రేపుతున్నది. తాను సీఎం అయిన 10 రోజుల వరకు నాకూ ఆ వాహనాలు ఉన్న విషయమే తెలియదని ఓ అధికారి చెప్పడంతో తెలిసిందని రేవంత్ రెడ్డి చెప్పడంతో ఈ విషయం చర్చనీయాశం అవుతోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేకున్నా గత సీఎం కేసీఆర్ మాత్రం తన కాన్వాయ్ ల కోసం పెద్దఎత్తున ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశాయి. అయితే కాన్వాయ్ ల కోసం కేసీఆర్ పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్న సంగతి ఇప్పుడు తెరమీదకు వచ్చినా ఈ విషయాన్ని 'దిశ' ఏడాది క్రితమే వెల్లడించింది.

సీఎంగా కేసీఆర్ టూర్ కాస్ట్లీ:

మాజీ సీఎం కేసీఆర్ అధికారంలో ఉండగా తన కాన్వాయ్ కోసం 22 ల్యాండ్ క్రూయిజర్లు కొనుకోలు చేసి వాటికి బులెట్ ఫ్రూఫ్, శాటిలైట్ టెక్నాలజీ హంగులు, సంతరించుకుని డెలీవరికి సిద్ధంగా ఉన్నాయి. అయితే మూడోసారి కూడా తామే అధికారంలోకి వస్తామన్న ధీమాతో కేసీఆర్ ఇష్టపడి ఈ పని చేయగా అనూహ్యంగా ఆయన అధికారాన్ని కోల్పోయారు. అయితే ఆయన అంతకు ముందే తన కాన్వాయ్ శ్రేణిలోకి ల్యాండ్ క్రూయిజర్స్ ఫ్రాడోను చేర్చుకుంటున్న విషయాన్ని దిశ పత్రిక 9 సెప్టంబర్ 2022 నాడు ' ముఖ్యమంత్రికి మూడో కాన్వాయ్' శీర్షికతో కథనం వెలువరించగా తాజాగా ఆ విషయం సీఎం రేవంత్ రెడ్డి బట్టబయలు చేశారు. పెన్షన్లు, ఉద్యోగుల వేతనాలు, ఇతర ఖర్చుల కోసం నానా పాట్లు పండుతున్న సర్కార్ సీఎం కేసీఆర్ కోసం మాత్రమం మూడో కాన్వాయ్ ని రెడీ చేస్తోందని కథనంలో పేర్కొంది.

దీంతో వాహన శ్రేణిలో దేశంలోనే కేసీఆర్ టాప్ అని ఇకపై సీఎం టూర్ చాలా కాస్ట్లీగా మారబోతోందని పేర్కొంది. అయితే తెలంగాణ ఏర్పడే నాటికి 7 ఫార్చునర్ కార్లు ఉండగా 15లో 5 ల్యాండ్ క్రూయిజర్లను ప్రభుత్వం కొనుగోలు చేసింది. 2022లో 08 ల్యాండ్ క్రూయిజర్స్ ఫ్రాడో,10 టయోటా టాప్ మోడల్ ఫార్చునర్లు, 02 వోల్వో బస్సులను నాటి ప్రభుత్వం సిద్ధం చేసేందుకు రెడీ అయింది. జాతీయ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన కేసీఆర్ ఆయన పొరుగు రాష్ట్రాల్లో పర్యటించేందుకు ఈ స్పెషల్ కాన్వాయ్ ని ఆంధ్రప్రదేశ్ లో సిక్రెట్ గా సిద్ధం చేస్తున్నట్లు దిశ పత్రిక తన కథనంలో పేర్కొంది. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ కేసీఆర్ ముచ్చటపడిన ఖరీదైన కాన్వాయ్ శ్రేణి వివరాలను బయట పెట్టడం, వాటిని విజయవాడలో దాచిపెట్టారని వ్యాఖ్యలు చేయడం చర్చనీయాశంగా మారింది.

Read more : దిశ పత్రిక 9 సెప్టంబర్ 2022 నాడు ' ముఖ్యమంత్రికి మూడో కాన్వాయ్' శీర్షికతో కథనం

Next Story