KCR: తెలంగాణ ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు

by Gantepaka Srikanth |
KCR: తెలంగాణ ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ అస్తిత్వానికి, సాంస్కృతిక జీవనానికి ప్రతీక బతుకమ్మ పండుగ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం మీడియా ప్రకటన విడుదల చేశారు. ప్రకృతిని, పూలను దేవతగా కొలిచే బతుకమ్మ పండుగ అని, ప్రపంచ సంస్కృతీ సాంప్రదాయాల్లోనే ప్రత్యేకతను చాటుకుందన్నారు. తరతరాలుగా మహిళా శక్తికి, ఐక్యతకు దర్పణం బతుకమ్మ పండుగ అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకోసం సాగిన సాంస్కృతిక ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజల అస్తిత్వ ఆకాంక్షలకు వేదికగా నిలిచిందన్నారు.

ఎంగిలి పూలతో ప్రారంభమై సద్దులతో ముగిసే తొమ్మిది రోజులపాటు పల్లెలు, పట్టణాలు బేధం లేకుండా మహిళలు.. చిన్నారులతో సందడి నెలకొంటుందన్నారు. బతుకమ్మ విశిష్టతను గుర్తించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం ‘బతుకమ్మ’ను రాష్ట్ర పండుగగా ప్రకటించిందని తెలిపారు. మహిళలకు ప్రత్యేక కానుకలను అందజేసిందన్నారు. ఆటా పాటలతో పండుగను ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలని మహిళలను కోరారు. ప్రజల జీవితాల్లో బతుకమ్మ వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.

Advertisement

Next Story

Most Viewed