కేసీఆర్ బిగ్ ట్విస్ట్.. మునుగోడు సభలో కీలక ప్రకటన?

by Disha Web Desk 4 |
కేసీఆర్ బిగ్ ట్విస్ట్.. మునుగోడు సభలో కీలక ప్రకటన?
X

దిశ, వెబ్‌డెస్క్: మునుగోడు ఉపఎన్నికను అధికార టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. తప్పకుండా గెలవాలని ఫిక్స్ అయింది. ఇందుకోసం ప్రభుత్వ పరంగా పెండింగ్ పనులను సైతం కేసీఆర్ సర్కార్ స్పీడప్ చేసింది. అయితే బీజేపీని ఎదుర్కొనేందుకు గులాబీ బాస్ సీఎం కేసీఆర్ పక్కా స్కెచ్ వేసుకున్నట్లు తెలుస్తోంది. మునుగోడులో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేను అయినందువల్లే ఇక్కడ అభివృద్ధి జరగకుండా టీఆర్ఎస్ అడ్డుకుందని, తన రాజీనామాతో మునుగోడులో అభివృద్ధి జరుగుతోందనే రాజగోపాల్ రెడ్డి విమర్శలకు చెక్ పెట్టేలా ముఖ్యమంత్రి లెక్కలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే రేపు జరగబోతున్న ప్రజాదీవెన సభలో కేసీర్ బిగ్ ట్విస్ట్ ఇస్తారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

సభలో కేసీఆర్ అనూహ్య ప్రకటన?

దుబ్బాక, హుజూరాబాద్ ఫలితాల నేపథ్యంలో మునుగోడు విషయంలో ఎలాంటి పొరపాటు లేకుండా టీఆర్ఎస్ జాగ్రత్త పడుతోంది. ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తే అభివృద్ధికి ఎన్నికల కోడ్ రూపంలో ఆటంకం వస్తుందని భావించిన టీఆర్ఎస్.. పెండింగ్ పనులన్నింటికి చకచకా శ్రీకారం చుడుతోంది. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే పార్టీ వీడటంతో నేతల మధ్య కుమ్ములాటకే కాంగ్రెస్ పరిమితం కాగా.. ఇక్కడ టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా టఫ్ ఫైట్ నడుస్తోంది. దీంతో బీజేపీని ఎదుర్కొనేందుకు కేసీఆర్ తాజా సమీకరణాలతో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. అమిత్ షా సభ కంటే ముందే మునుగోడులో కేసీఆర్ సభ నిర్వహించబోతున్నారు. రేపటి సభలో ప్రధానంగా అభ్యర్థి విషయంలో స్పష్టత వస్తుందా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని చాలా మంది వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఆయనకు బదులు కర్నె ప్రభాకర్ పేరును ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం నియోజకవర్గంలో కర్నె ప్రభాకర్ ఫ్లెక్సీలు, బ్యానర్లు, నిలువెత్తు కేసీఆర్ కటౌట్లు.. వాటి మధ్యలో కర్నె ప్రభాకర్ ఫోటోలు దర్శనమిస్తుండటం గులాబీ పార్టీలో చర్చనీయాంశం అవుతోంది. బీసీ ఓట్లు అధికంగా ఉన్న మునుగోడులో సొంత నేతల అసమ్మతికి చెక్ పెట్టాలంటే కర్నె ప్రభాకర్ అభ్యర్థిత్వమే సరైనదనే అభిప్రాయానికి కేసీఆర్ వచ్చినట్లు ప్రచారం సాగుతోంది. రేపటి సభలో ఈ విషయాన్ని ప్రకటిస్తారా? లేక నోటిఫికేషన్ వచ్చే వరకు అభ్యర్థి విషయంలో సస్పెన్స్ కొనసాగిస్తారా? అనేది రేపటి సభతో తేలిపోనుంది. మరోవైపు తన సభ జరిగిన మరుసటి రోజే అమిత్ షా నియోజకవర్గానికి రానున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వంపై కేసీఆర్ మరోసారి ప్రశ్నల వర్షం కురిపించే అవకాశం ఉందని తెలుస్తోంది. గతంలో సికింద్రాబాద్ లో జరిగిన మోడీ సభకు ముందు కేసీఆర్ ప్రశ్నాస్త్రాలను సంధించి వాటికి సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. తాజాగా మునుగోడులోనూ ఇదే తరహా ఎటాక్ చేసే ఛాన్స్ లేకపోలేదంటున్నారు విశ్లేషకులు.

వారి లెక్కలు తీసే పనిలో టీఆర్ఎస్?

అభివృద్ధి విషయంలో ప్రతిపక్షాలకు చెక్ పెట్టేందుకు కేసీఆర్ సంక్షేమ అస్త్రాన్ని ప్రయోగించబోతున్నట్లు తెలుస్తోంది. 2014 నుంచి 2018 వరకు టీఆర్‌ఎస్ ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించినప్పుడు, అలాగే 2018 నుంచి 2022 మధ్య కాంగ్రెస్ ప్రాతినిధ్యం వహించిన సమయంలో మునుగోడు ప్రజలకు, నియోజకవర్గంలో అభివృద్ధిపై టీఆర్ఎస్ అధికారిక డేటాను బహిరంగపరిచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రైతు బంధు, ఆసరా పెన్షన్లు, కేసీఆర్ కిట్లు, రైతుబీమా, సీఎం రిలీఫ్ ఫండ్, రుణమాఫీ, కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్, గొర్రెల పంపిణీ, డెయిరీ యూనిట్లు, దళిత బంధు, వరి సేకరణ కార్యక్రమాలు, వడ్డీ లేని రుణాలు వంటి సంక్షేమ పథకాల లబ్దిదారుల వివరాలపై టీఆర్ఎస్ నజర్ వేసినట్లు తెలుస్తోంది. వీరందరి ఇళ్ల వద్దకు వెళ్లి టీఆర్ఎస్ ద్వారా పొందిన లబ్దిని వివరించే ప్రయత్నం చేయనుంది. ఇదే సమయంలో ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ రాజకీయ ఉచితాలపై చేసి వ్యాఖ్యలను లబ్దిదారులకు వివరించి బీజేపీకి చెక్ పెట్టేలా గులాబీ బాస్ ప్రణాళికలు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా సంక్షేమ ఫలితాలు అందిస్తుంటే బీజేపీ అడ్డుకునే ప్రయత్నాలు చేస్తోందనే సింపతి క్రియేట్ చేయడానికి కేసీఆర్ నయా ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ లెక్కన నియోజకవర్గంలోని దాదాపు మూడు లక్షల మంది లబ్ధిదారులకు, ముఖ్యంగా ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన వారి మద్దతును కూడగడుతూ వారి ఓటు బ్యాంకింగ్ తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే టీఆర్ఎస్ ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా లబ్ది పొంది వారి చేత నియోజకవర్గంలో 'సంక్షేమ ర్యాలీలు' సైతం చేపట్టే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం 2014 నుంచి అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల వల్ల మునుగోడులో దాదాపు రూ.10,260 కోట్లతో 3,34,994 మంది లబ్ధిదారులు లబ్ధి నేరుగా పొంది ఉంటారని టీఆర్ఎస్ అంచనాలు వేసుకుంటోంది. ఇందుకు సంబంధించిన బెనిఫిషరీల వివరాలు బహిర్గతం చేసి బీజేపీని నిలువరించేలా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. రేపటి బహిరంగ సభలో నియోజకవర్గానికి మరికొన్ని వరాలను కురిపిస్తారని తెలుస్తోంది.

మునుగోడుకు హైదరాబాద్ నుంచి జనం

అన్ని బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీని అందిస్తున్న పోస్టాఫీసు SCSS స్కీం


Next Story

Most Viewed