తెలంగాణకు మూడోసారి కేసీఆరే సీఎం: దాసోజ్ శ్రవణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Disha Web Desk 19 |
తెలంగాణకు మూడోసారి కేసీఆరే సీఎం: దాసోజ్ శ్రవణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించడం ఖాయమని, మూడోసారి కేసీఆరే సీఎం అని ఆపార్టీ రాష్ట్ర నాయకుడు దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో శనివారం గ్రేటర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్యక్షతన ఆత్మీయ సమ్మేళనాలపై సమీక్ష నిర్వహించారు. పార్టీ కేడర్‌తో నేతలకు ఉన్న గ్యాప్‌ను పూడ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సుధీర్ఘంగా చర్చించారు. అనంతరం దాసోజు మాట్లాడుతూ.. లీడర్- క్యాడర్- కనెక్ట్ నినాదంతో ప్రజల్లో బీఆర్ఎస్ ఉంటుందన్నారు. గ్రేటర్‌లోని అన్ని డివిజన్లలో ఏప్రిల్ 20 వరకు ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహిస్తామన్నారు.

ఏప్రిల్ 14న అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణకు హైదరాబాద్ అంతా సంబరాలు నిర్వహించాలన్నారు. ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ప్రతీ డివిజన్‌లో నిర్వహించాలని కార్పొరేటర్లకు సూచించారు. ఏప్రిల్ 30న సెక్రటేరియట్ ప్రారంభం, ఎన్టీఆర్ స్టేడియంలో భారీ బహిరంగ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆగస్టు 16న దళితబంధు రెండేళ్ల కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు. ఈ నెల 21న గ్రేటర్ సిటీ నేతలతో జనరల్ బాడీ సమావేశం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీ ప్రభాకర్, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, నాగేందర్, గ్రేటర్ కార్పొరేటర్లు పాల్గొన్నారు.

Next Story