జాతీయ పార్టీ పేరు ప్రకటించిన కేసీఆర్

by Disha Web |
జాతీయ పార్టీ పేరు ప్రకటించిన కేసీఆర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. ఇప్పటి వరకు కొనసాగిన టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి) పార్టీని బీఆర్ఎస్ (భారత్ రాష్ట్ర సమితి)గా పేరు మార్చుతున్నట్లు వెల్లడించారు. బుధవారం మధ్యాహ్నం తెలంగాణ భవన్‌లో కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ పేరు మార్చుతూ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా పార్టీ నేతలంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. దీంతో ఇన్నాళ్లు తెలంగాణలో ఉద్యమ పార్టీగా కొనసాగిన టీఆర్ఎస్ ఇకపై జాతీయ స్థాయిలో బీఆర్ఎస్‌గా తన ప్రస్థానాన్ని కొనసాగించనుంది.

ఈ సమావేశానికి టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు సహా 283 మంది కీలక ప్రతినిధులు హాజరయ్యారు. ప్రత్యేక ఆహ్వానితులుగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత కుమారస్వామి, తమిళనాడుకు చెందిన వీసీకే పార్టీ అధ్యక్షుడు, ఎంపీ తిరుమవలవన్‌తో పాటు పలువురు ఇతర రాష్ట్రా నేతలు హాజరయ్యారు.

Next Story

Most Viewed