BREAKING: లిక్కర్ స్కామ్‌లో కవిత అరెస్ట్.. శ్రేణులకు BRS సంచలన పిలుపు..!

by Disha Web Desk 19 |
BREAKING: లిక్కర్ స్కామ్‌లో కవిత అరెస్ట్.. శ్రేణులకు BRS సంచలన పిలుపు..!
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు శుక్రవారం సాయంత్రం కవితను అదుపులోకి తీసుకున్నారు. కవిత అరెస్ట్ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్ట్‌కు వ్యతిరేకంగా రేపు (శనివారం) రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసనలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఇదిలా ఉంటే, లిక్కర్ స్కామ్‌లో కవితను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు ఆమెను ఢిల్లీకి తరలిస్తున్నారు. కవిత ఇంటి నుండి కారులో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు తరలించిన అధికారులు.. అక్కడి నుండి స్పెషల్ ఫ్లైట్‌లో ఢిల్లీకి తీసుకువెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. ఢిల్లీ ఎయిర్ పోర్టు నుండి నేరుగా ఈడీ ప్రధాన కార్యాలయానికి తరలించనున్నారు. ఇవాళ రాత్రి కవిత ఈడీ ప్రధాన కార్యాలయంలోనే ఉండనున్నారు. రేపు ఈడీ ఆమెను కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.

కవిత అరెస్ట్‌పై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్ట్ రాజకీయ కుట్ర అని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. అక్రమ అరెస్ట్‌లు, వేధింపులు మాకు కొత్తేమి కాదని అన్నారు. బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్‌ను డిమొరలైజ్ చేసే ప్రయత్నం బీజేపీ, కాంగ్రెస్ కలిసి చేశాయని ఆరోపించారు. రేపు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వస్తుందనగా ఈ రోజు కవితను అరెస్ట్ చేశార.. 19వ తేదీన సుప్రీం కోర్టులో కవిత పిటిషన్‌పై వాదనలు ఉంటే ఇంత హడావుడిగా ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. బీజేపీ పాలన ఎమర్జెన్సీని తలపిస్తోందని ధ్వజమెత్తారు. అక్రమ అరెస్టుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని.. న్యాయపోరాటం చేస్తామని ఈ సందర్భంగా హరీష్ రావు స్పష్టం చేశారు. కవిత అరెస్ట్‌కు వ్యతిరేకంగా రేపు (శనివారం) రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసనల చేపట్టాలని పిలుపునిచ్చారు.

Next Story

Most Viewed