యువత జాతీయ భావంతో ముందుకు సాగాలి : ఎంపీ సంజయ్

by Disha Web Desk 23 |
యువత జాతీయ భావంతో ముందుకు సాగాలి : ఎంపీ సంజయ్
X

దిశ,రామడుగు: యువత జాతీయ భావంతో ముందుకు సాగాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. రామడుగు మండలం గోపాల్ రావు పేట గ్రామ ప్రధాన చౌరస్తాలో ఏర్పాటు చేసిన జాతీయ జెండా కోసం ఎంపీ నిధుల నుంచి మూడు లక్షల రూపాయల ప్రొసీడింగ్ కాపీని సోమవారం బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ జిన్నారం విద్యాసాగర్ ఆధ్వర్యంలో గ్రామస్తులకు అందజేశారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ కి గ్రామ యువకులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి పోచంపల్లి నరేష్, యువ మోర్చ మండల ఉపాధ్యక్షులు బండారి శ్రీనివాస్, నేచర్ యూత్ క్లబ్ అధ్యక్షులు కాసారపు పరశురాం, యువకులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed