దేశం కోసం ధర్మం కోసం రోజులో ఒక గంట సమయాన్ని యువత కేటాయించండి : బండి సంజయ్

by Disha Web Desk 23 |
దేశం కోసం ధర్మం కోసం రోజులో ఒక గంట సమయాన్ని యువత కేటాయించండి : బండి సంజయ్
X

దిశ,శంకరపట్నం : ప్రజాహిత యాత్రలో భాగంగా బండి సంజయ్ సైదాపూర్ మండలంలో నుండి వీణవంక వెళ్లే క్రమంలో భోజన విరామం కై మొలంగూర్ ఖిల్లా వద్ద ఆగి చారిత్రక ప్రాధాన్యం గల దూది బావి నీరును స్వయంగా తోడుకొని రుచి చూశారు. తర్వాత అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం భోజనం చేసి విలేకరులతో మాట్లాడుతూ నియోజకవర్గాలలో ప్రజాహిత యాత్ర పూర్తి అయినది అని అన్నారు. నరేంద్ర మోడీ తప్ప వేరే , పార్టీకి ఓటు వేసేది లేదని ప్రజలు అంటున్నారు అని, ప్రజాహిత యాత్రకు ప్రజల నుంచి భారీ స్పందన వస్తుంది. నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల గెలిపిస్తాయి బీఆర్ఎస్ కాంగ్రెస్ ల ప్రజా వ్యతిరేకత బీజేపీని గెలిపిస్తుంది అని అన్నారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీ మరి కాంగ్రెస్ కు ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు ప్రధానిని ప్రకటించని పార్టీకి ప్రజలు ఎలా ఓట్లు వేస్తారు అని అన్నారు. ప్రపంచ దేశాలు నరేంద్ర మోడీని కీర్తిస్తున్నాయి అని. ఇవి మోడీ ఎన్నికలు మోడీని ప్రధాని చేసే ఎన్నికలు అని అన్నారు.

దేశం కోసం ధర్మం కోసం పనిచేసే యువత కావాలి

రోజులో ఒక గంట యువత దేశం కోసం కేటాయించాలన్నారు కాంగ్రెస్ పాలనలో దేశం అధోగతి పాలైంది ఎక్కడ చూసినా కుంభకోణాలే కనిపించేవి అని అన్నారు. పది సంవత్సరాల బీజేపీ పాలనలో , చిన్న అవినీతి ఆరోపణ రాలేదు అన్నారు. సమాజాన్ని సంఘటితం చేసే విషయంలో కానీ దేశాన్ని రక్షించే విషయంలో కానీ యువత నరేంద్ర మోడీ చేసిన కృషిని గుర్తించి మరోసారి నరేంద్ర మోడీని ప్రధాని చేయాలన్నారు.


Next Story

Most Viewed