మానవత్వం చాటుకున్న యువకులు

by Dishafeatures2 |
మానవత్వం చాటుకున్న యువకులు
X

దిశ, మల్లాపూర్: మండలంలోని రేగుంట గ్రామ ఆల్ యూత్ అసోసియేషన్, స్పోర్ట్స్ క్లబ్ సభ్యుడు దూడ రాజు పూజ దంపతులు వీరికి ఇద్దరు పిల్లలు కొడుకు, కూతురు ఉన్నారు. కుటుంబ పెద్ద రాజు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. బాధిత కుటుంబానికి రేగుంట ఆల్ యూత్ అసోసియేషన్, స్పోర్ట్స్ క్లబ్ సభ్యులు అండగా నిలిచారు. విరాళాలు సేకరించి రాజు భార్యకు రూ.90 వేల ఆర్థిక సాయం అందించారు. భవిష్యత్తులో ఎలాంటి అవసరమున్నా బాధిత కుటుంబానికి అండగా ఉంటామని ఈ సందర్భంగా యూత్ కమిటీ సభ్యలు హామీ ఇచ్చారు. తోటి సభ్యుడిని ఆదుకున్న యువకులను స్థానికులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు బందెల నరేష్, కోశాధికారి వేములవాడ దేవరాజం, ఆర్గనైజర్ మోతే రమేష్, కార్యదర్శి కుందేళ్ల రాజేష్, నిమ్మల అశోక్, మోతే రవి, చెన్నూరి రమేష్, నరహరి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed