మాటల ప్రభుత్వం కాదు.. ఇది చేతల ప్రభుత్వం : ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

by Disha Web Desk 1 |
మాటల ప్రభుత్వం కాదు.. ఇది చేతల ప్రభుత్వం : ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
X

దిశ, సుల్తానాబాద్ : రాష్ట్రంలో ఉంది మాటల ప్రభుత్వం కాదని.. చేతల ప్రభుత్వమని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. ఆదివారం సుల్తానాబాద్ మండలంలోని సాంబయ్యపల్లిలో ఎస్డీఎఫ్, ఈజీఎస్ నిధుల నుంచి రూ.20లక్షలతో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అభివృద్ధే ధ్యేయంగా ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, మరోవైపు సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలోనే పెద్దపల్లి నియోజకవర్గాన్ని ముందు వరసలో నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో రైతుబంధు జిల్లా కో-ఆర్డినేటర్ కాసర్ల అనంత రెడ్డి, ఎంపీపీ పొన్నమనేని బాలాజీ రావు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పురం ప్రేమ్ చందర్ రావు, రైతు సమన్వయ సమితి మండల కో-ఆర్డినేటర్ బోయిని రాజ మల్లయ్య, ఫ్యాక్స్ చైర్మెన్ జూపల్లి సందీప్ రావు, కన్వీనర్ లంక దాసరి రవి, సర్పంచ్ చెలుకల బాపురెడ్డి, ఎంపీటీసీ గట్టు శ్రీనివాస్, ఉప సర్పంచ్ హన్మంత రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు మాజీ సర్పంచ్ రాజ్ కుమార్, నారాయణరావుపల్లి సర్పంచ్ ములుగూరి వెంకట లక్ష్మీ-అంజయ్య గౌడ్, సుధాకర్ రెడ్డి, సంపత్ రెడ్డి, ఆదిరెడ్డి, రాజిరెడ్డి, పాపిరెడ్డి, ఆసరి రజినీకాంత్,ఉప సర్పంచ్ చెలుకల రామచంద్రారెడ్డి, బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed