మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం : టెలికాం శాఖ డైరక్టర్ శ్రీనివాస్ బహదూర్

by Nallavelli.Anjaneyulu |

మహిళా ఆర్థిక అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర టెలికాం శాఖ డైరక్టర్ శ్రీనివాస్ బహదూర్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్రామ్ రెడ్డి అన్నారు.

మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం : టెలికాం శాఖ డైరక్టర్ శ్రీనివాస్ బహదూర్
X

దిశ, తిమ్మాజీపేట : మహిళా ఆర్థిక అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర టెలికాం శాఖ డైరక్టర్ శ్రీనివాస్ బహదూర్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్రామ్ రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ‌ ప్రయాణ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి ఆర్టీసీ బస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాలతో కలిసి జెండా ఊపి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళా స్వయం సహాయక సంఘాలకు ఇందిరా మహిళా శక్తి మహిళలకు ఉపాధి ద్వారా కుటుంబ ఆర్థిక స్థితినీ బలోపేతం చేస్తూ రాష్ట ప్రభుత్వం నుంచి అందాల్సిన రుణాలను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృధినీ చూసి ప్రతిపక్షాలు చేస్తున్న ప్రయత్నాలు ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.

అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరా శక్తి మహిళా సంఘాల ఆధ్వర్యంలో అద్దె ఆర్టీసీ బస్సులు దాదాపు 553 సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదుగా హైదరాబాద్ లో నిర్వహిస్తున్న కార్యక్రానికి పాల్గొని ప్రారంభం చేస్తారని అందుకు మహిళా సంఘాల సభ్యులు మండలం నుంచి పెద్దఎత్తున హైదరాబాద్ కు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగది మల్లయ్య గౌడ్, చిలుక సురేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరకర్ మధావులు, షేక్ ముబారక్, మహమ్మద్ ఉస్మాన్, లక్ష్మీ నారాయణ, దేవస్వామి, అబ్దుల్ రావూఫ్, వరుణ్ కుమార్, వట్టేపు వెంకటయ్య, బాబా కుతుబుద్దీన్, ఏపీఎం, మహిళా సంఘాల సభ్యులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Next Story