అవార్డు అందుకోబోతున్న వేళ... తాగునీటి హాహా కారాలు..

by Sumithra |
అవార్డు అందుకోబోతున్న వేళ... తాగునీటి హాహా కారాలు..
X

దిశ, తిమ్మాపూర్ : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని వచ్చునూర్ గ్రామంలో తాగునీటి వనరులు ఉన్నప్పటికీ పంచాయతీ సిబ్బందికి వేతనాలు చెల్లించే పరిస్థితి లేకపోవడం.. ఆ గ్రామస్తులకు శాపంగా మారిందనే అభిప్రాయాలు విన్పిస్తున్నాయి. పంచాయతీ సిబ్బంది పని చేయకపోవడంతో గత వారం రోజులుగా తమకు తాగు నీటి సమస్యలు తప్పడం లేదని గ్రామస్తులు వాపోయారు. ఉన్నతాధికారులు స్పందించి తమ సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

తమ గ్రామంలో పంచాయితీ కార్యదర్శి కూడా లేక పోవడంతో ఇబ్బందులు తప్పడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యదర్శి లేకపోవడంతో పాటు ఆర్థిక సంవత్సరం ముగింపు ఉండగా డబ్బులు గత రెండు నెలలుగా ఫ్రీజింగ్ లో ఉన్నాయని సర్పంచ్ ఉమారాణి తెలిపారు. పంప్ డ్రైవర్ సకాలంలో స్పందించకపోవడంతో పలుమార్లు తానే పంప్ ఆపరేటర్ గా పని చేసినట్లు ఆమె తెలిపారు. కాగా పలు విభాగాల్లో ఉత్తమ ప్రదర్శన కనబర్చి త్వరలో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోబోతున్న తిమ్మాపూర్ మండలంలో తాగు నీటి లేక హాహా కారాలు వినిపించడం చర్చనీయంశంగా మారింది.

Next Story

Most Viewed