ఇంకుడు గుంతల పైసలు ఎటువాయే..? ఆలస్యంగా వెలుగులోకి

by Aamani |
ఇంకుడు గుంతల పైసలు ఎటువాయే..?  ఆలస్యంగా వెలుగులోకి
X

దిశ,చందుర్తి : రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో 2019 నుండి 2021 సంవత్సరంలో ఈజీఎస్ నిధుల నుండి ఇంకుడు గుంతల నిర్మాణం చేశారు. ఇప్పటివరకు ఇంకుడు గుంతల నిర్మాణం చేసిన పైసలు ఇప్పటివరకు రాలేదు. ఈ ఇంకుడు గుంతల పైసలు రాకపోవడంలో అంతర్యం ఏంటి,మూడు సంవత్సరాల తర్వాత ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఇంకుడు గుంతల పైసలు ఎటు పోయే అని బాధితులు.

వివరాల్లోకి వెళితే

చందుర్తి మండలం లోని లింగంపేట గ్రామంలో 2019 నుండి 2021 సంవత్సరంలో ఆ గ్రామంలో సుమారు 78 మంది ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టారు. అందులో 26 మందికి అప్పటి నుండి ఇప్పటివరకు ఇంకుడు గుంతల పైసలు రాలే ఒక్క ఇంకుడు గుంత నిర్మాణం చేసుకుంటే ఒక్కో దానికి వచ్చే పైసలు 3200 రూపాయలు, దాదాపు 83 వేల రూపాయల పైసలను గ్రామ పంచాయతీకి చెందిన అకౌంట్ లోనే ఉంచారు . దాదాపు నాలుగు సంవత్సరాల నుండి ఇప్పటివరకు పైసలు రాకపోవడంతో గుంతలు నిర్మాణం చేపట్టిన వారు గ్రామ పంచాయతీకి వెళ్లి కార్యదర్శి లింగమూర్తి ని నిలదీశారు. గ్రామ పంచాయతీ అకౌంట్లో ₹1,50,000 ఉండడం వాస్తవమేనని, ఇంకుడు గుంతల కు సంబంధించిన లిస్టు రాలేదు.

లిస్టు వచ్చిన తర్వాతనే పైసలు ఇస్తామని అన్నట్లు బాధితులు తెలిపారు. లింగంపేట గ్రామం ప్రజలు మండల కార్యాలయానికి వచ్చి ఏపీవో రాజయ్యను ఇంకుడు గుంతల పైసల గురించి ఇప్పటివరకు పైసలు ఎందుకు ఇవ్వలేదు అని ఇంకుడు గుంతల బాధితులు వాపోయారు. మేము గ్రామ పంచాయతీకి మూడు సంవత్సరాల క్రితమే డబ్బులు గ్రామ పంచాయతీకి చెందిన అకౌంట్లో జమ చేశామని అన్నారు. ఆ డబ్బుల గురించి నాకు 15 రోజుల క్రితమే తెలిసిందని అన్నారు.

అసలు ఇప్పటివరకు పైసలు ఇవ్వకపోవడంపై గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూడు సంవత్సరాల కిందటే గ్రామపంచాయతీ అకౌంట్ లో పడిన డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదు, దీని వెనుక ఎవరున్నారు, గత పాలకుల నిర్లక్ష్యం వల్లనేనా అని ప్రజలు అనుకుంటున్నారు.

ఏపీఓ రాజయ్య వివరణ..

ఏపీవో రాజయ్య ను దిశ విలేకరి వివరణ కోరగా లింగంపేట కార్యదర్శి నాకు 15 రోజుల క్రితం మాత్రమే ఈ విషయం తెలిపారు. గ్రామపంచాయతీ అకౌంట్ లో పడిన డబ్బుల లిస్టు త్వరలోనే అప్పజెప్తామని అన్నారు, ఇందులో 56 మందికి ఎవరి అకౌంట్లో వారికి డబ్బులు జమ చేసి ఇప్పటికీ మూడు సంవత్సరాల అవుతుందని అన్నారు. మిగిలిన 26 మందికి త్వరలోనే అప్పజెప్తామని అన్నారు.



Next Story

Most Viewed