రవాణా ఖర్చులే మోపెడు .. చెరుకు ఫ్యాక్టరీ తెరిచేదెప్పుడో

by Disha Web Desk 12 |
రవాణా ఖర్చులే మోపెడు .. చెరుకు ఫ్యాక్టరీ తెరిచేదెప్పుడో
X

దిశ, మల్లాపూర్: మండలంలోని ముత్యంపేట చెరుకు ఫ్యాక్టరీ ని 1980 సంవత్సరంలో స్థాపించినప్పటి నుండి 2015 డిసెంబర్ వరకు నిరంతరాయంగా నడిచింది. 2002 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు 51 శాతం ప్రైవేట్ పరం చేశారు.తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డాక ఫ్యాక్టరీ మూతపడడం చాలా దురదృష్టకరం.

సంవత్సరాలు గడిచిన ఇంకా ప్రారంభానికి మోక్షం లభించడం లేదు.చెరుకు ఫ్యాక్టరీ ప్రారంభమైతే ఇక్కడి ప్రాంత రైతులకు మేలు జరుగుతుంది. రైతు లేనిదే రాజ్యం లేదు అనే నినాదం తప్ప రైతులకు కష్టాలు తప్పడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం చెరుకు ఫ్యాక్టరీ పునరుద్ధీకరణ చేయాలని ప్రాంత రైతులు కోరుచున్నారు.

చెరుకు ఫ్యాక్టరీలో 49 శాతం ప్రభుత్వానికి సంబంధించింది కాగా, 51 శాతం గోకరాజు గంగరాజు ది కాగా ప్రభుత్వం తలచుకుంటే ఫ్యాక్టరీ తెరిపించలేరా..? మండలంలోని చెరుకు రైతులు ప్రస్తుతం వాళ్ల పంటను కామారెడ్డి ఫ్యాక్టరీకి తరలించడం ద్వారా రవాణా ఖర్చు రైతులకు భారంగా మారింది. ఫ్యాక్టరీ మూతబడిన సంవత్సరం 2015లో చెరుకు తరలించడానికి రైతులకు రవాణా ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరించింది.

ప్రస్తుతం చెరుకు టన్నుకు ధర 3260 ఉండగా కామారెడ్డి ఫ్యాక్టరీ కి 150 కి.మి తరలించడం ద్వారా టన్ను కు 1300 ఖర్చు వస్తుంది. వరి సాగు ను తగ్గించాలని ప్రభుత్వం అనేక సందర్భాలలో ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే...ఫ్యాక్టరీ ప్రారంభిస్తే చుట్టు ప్రక్కల ప్రాంత రైతులకు చెరకు సాగుతో మేలు జరుగుతుంది.

చెరకు సాగు విధానం

ఒక్కసారి చెరకు పంట సాగు చేస్తే మూడు సంవత్సరాలు పంట వస్తుంది. రైతులకు ఖర్చులు ఆదా అవుతాయి. ఇకనైనా ఫ్యాక్టరీ ప్రారంభించి రైతులకు మేలు జరిగేలా చూడాలని ప్రాంత రైతులు కోరుకుంటున్నారు.

ప్రభుత్వ హామీ

2014 ఎన్నికల్లో ప్రభుత్వం చక్కెర ఫ్యాక్టరీని ప్రభుత్వ పరం చేస్తాం అని ఇచ్చిన హామీ ,హామీ గానే మిగిలింది.

ఫ్యాక్టరీ ప్రారంభించే వరకు ఉద్యమిస్తాం...

ఫ్యాక్టరీ కోసం ఏళ్ళు గా రైతులు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఫ్యాక్టరీ వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఇక్కడి ప్రాంత రైతులు అందరం కలిసి ఫ్యాక్టరీ ప్రారంభించే వరకు ఉద్యమిస్తామన్నారు:- చెరుకు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు మామిడి నారాయణా రెడ్డి



Next Story