భూ దందాలు అన్నీ బయటపెడతాం : మంత్రి పొన్నం

by Disha Web Desk 23 |
భూ దందాలు అన్నీ బయటపెడతాం : మంత్రి పొన్నం
X

దిశ,హుజురాబాద్ రూరల్ : కరీంనగర్ పట్టణంతోపాటు వివిధ ప్రాంతాల్లో పేదల భూములను గుంజుకుని భూదందాలు చేసిన వ్యక్తుల బండారం త్వరలోనే బయటపెడతామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం మండలంలోని జూపాక గ్రామంలో సమ్మక్క సారలమ్మలను ఆయన దర్శించుకున్నారు. ఆయనతోపాటు హుజరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ప్రణయ్ బాబు, మంత్రి అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... అమ్మవారి ఆశీర్వాదంతో అందరూ బాగుండాలని మొక్కుకున్నట్లు తెలిపారు.

తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుందని, ప్రజా సమస్యలను పరిష్కరిస్తుందని అన్నారు. సమ్మక్క సారలమ్మల ఆశీర్వాదంతో రాబోయే రోజుల్లో సమృద్ధిగా వర్షాలు పడి పాడిపంటలతో, పిల్లాపాపలతో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని సమ్మక్క సారలమ్మను ప్రార్థించినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందించాలనేదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Next Story

Most Viewed