కారు స్టీరింగ్ ఓవైసీ చేతిలో.. అమిత్ షా

by Disha Web Desk 13 |
కారు స్టీరింగ్ ఓవైసీ చేతిలో.. అమిత్ షా
X

దిశ, జగిత్యాల ప్రతినిధి/ మెట్టుపల్లి: తెలంగాణలో అధికారం చేపట్టి కుటుంబ పాలన నుండి విముక్తి కలిపిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబ అవినీతి పాలనపై కమిటీ వేసి విచారించి జైలుకు పంపుతాన్నారు. తండ్రి కొడుకులతో బీఆర్ఎస్ 2జి, ఓవైసీ లతో కాంగ్రెస్ 3జి, కాంగ్రెస్ కుటుంబ పాలనతో 4జి పార్టీలుగా ఉన్నాయని విమర్శించారు. కుటుంబ పార్టీలను అంతమొందించడానికి ప్రతి ఒక్కరు బీజేపీకి అండగా నిలబడాలని కోరారు. తెలంగాణ లో కారు స్టీరింగ్ కవిత కేటీఆర్ చేతుల్లో లేదని ఎంఐఎం పార్టీ ఓవైసీ చేతుల్లో ఉందని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా మాట్లాడారు.

సీఎం కేసీఆర్ ఓవైసీకి భయపడి విమోచన దినోత్సవాన్ని జరపడం లేదని విమర్శించారు. బిజెపి అధికారంలోకి వచ్చాక విమోచన దినాన్ని రాష్ట్ర దినోత్సవం గా జరుపుతామని అన్నారు. బీసీలను కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మోసం చేసాయని బీజేపీ మాత్రం బీసీ ముఖ్యమంత్రి మాటకు కట్టుబడి ఉంటుందన్నారు. పసుపు బోర్డు విషయంలో ఎంపీ ధర్మపురి అరవింద్ కేంద్రాన్ని ఒప్పించి సాధించాడని పసుపు ఆయుర్వేద గుణాలపై అధ్యయనం చేసేందుకు 200 కోట్లు కేటాయిస్తున్నట్లుగా తెలిపారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక మూతపడిన చక్కెర ఫ్యాక్టరీలను తెరిపించడంతోపాటు గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ఎన్నారై మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. నిజామాబాద్‌లో బీడీ కార్మికుల కోసం 500 బిడ్డలతో అతిపెద్ద ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని అన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం మేము బీజేపీ చిత్తశుద్ధితో ఉందని మాదిగలకు న్యాయం చేస్తామని తెలిపారు. కోరుట్లలో బీజేపీ బలపరిచిన అభ్యర్థి ధర్మపురి అరవింద్ గెలిపిస్తే పెద్ద స్థానంలో ఉంచుతామని అన్నారు.

Next Story