ప్రజా ధనం వృధా.. ఎండిపోతున్న హరితహారం మొక్కలు ..

by Disha Web Desk 23 |
ప్రజా ధనం వృధా..  ఎండిపోతున్న హరితహారం మొక్కలు ..
X

దిశ, మానకొండూరు: కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని పలు గ్రామాల్లో రోడ్డుకు ఇరువైపులా ఉపాధి హామీ కూలీలతో నాటి నటువంటి చెట్లు నీళ్ళు లేక ఎండి పోతున్నాయి. కోట్లాది రూపాయలు ప్రజా ధనం ఖర్చు చేసి గత ప్రభుత్వం మొక్కలు పెట్టారు. కానీ మొక్కలకు ట్రీ గార్డులు లేవు. మరోపక్క ఉపాధి హామీ కూలీలతో బిందెలతో పొలాల్లో,చెరువులో ప్రమాదంగా ఉన్న, ఆడవారితో నీళ్లు మోసుకొని చెట్లకు అరకొరగా పొయిస్తున్నారు .

ఎంత పోసిన అసలే మండేటి ఎండలు, మొక్కల పెంపకం కోసం గ్రామ పంచాయితీకి గత ప్రభుత్వం ట్యాంకర్ల ను ఇచ్చిన సంగతి తెలిసిందే.కానీ అవి ప్రస్తుతానికి వాటితో ఏం పనులు చేయిస్తున్నారో అధికారులకు తెలియాలి.ఇకనైనా రోడ్డుకు ఇరువైపుల ఉన్న చెట్లు ఎండిపోకుండా సరైన పద్ధతిలో వాటిని కాపాడాలని అధికారులను కోరుతున్నారు.


Next Story