జైలు కన్నా హీనంగా సంక్షేమ హాస్టల్స్.. వేములవాడ ఎమ్మెల్యే రాజీనామాకు డిమాండ్

by Disha Web |
జైలు కన్నా హీనంగా సంక్షేమ హాస్టల్స్.. వేములవాడ ఎమ్మెల్యే రాజీనామాకు డిమాండ్
X

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: జర్మనీలో ఉండి పాలన ఎలా సాగిస్తారు..? వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు పై ఏబీవీపీ ఆధ్వర్యంలో బీసీ హాస్టల్స్ సందర్శన సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్ మండిపడ్డారు. వేములవాడ లో బీసీ హాస్టల్స్ సందర్శన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే చేతకాని తనంతో వేములవాడ నియోజకవర్గం లో సమస్యల నిలయంలో విద్యార్థులు చదువుకుంటూ ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.

వేములవాడ లో జైలు కన్నా హీనంగా సంక్షేమ హాస్టల్స్ దుర్భర స్థితిలో ఉన్నాయన్నారు. విద్యార్థుల సమస్యలు పట్టించుకోని ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు జర్మనీ లో ఉండి పాలనా ఎలా చేస్తారు.. ఎమ్మెల్యే హాస్టల్స్ సందర్శన చేసి సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. ఇంటర్ కళాశాలలో కనీస మౌలిక వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎమ్మెల్యే మాత్రం జర్మనీ లో ఏసీ రూం కార్లలో తిరుగుతున్నాడు. వేములవాడ నియోజకవర్గం విద్యార్థులు సమస్యలు పరిష్కారం చేయకుంటే త్వరలో మంత్రి కేటీఆర్‌ని అడ్డుకుంటామని హెచ్చరించారు.

ఎలా నాణ్యమైన ఆహారం అందుతుంది..

గురుకుల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం సరైన భోజనం అందించడం లేదు. ఏడేండ్లుగా మెస్​చార్జీలు పెంచడం లేదు. రూ. 30 పెడితే బయట ప్లేట్​ఇడ్లీ కూడా రావట్లేదు. కానీ సర్కారు మాత్రం ఆ ముప్పై రూపాయల్లోనే ఒక్కో స్టూడెంట్‌కు రోజుకు మూడుపూటలా క్వాలిటీ ఫుడ్​పెట్టాలంటున్నది.

జిల్లాలో జైలు కన్నా హీనంగా సంక్షేమ హాస్టల్స్..

రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పిన విధంగా సన్న బియ్యం ఎక్కడ ఇస్తలేరు.. సన్న బియ్యం బదులుగా పాలీష్ దొడ్డు బియ్యం ఇస్తున్నారు. మెస్ చార్జీలు వెంటనే పెంచాలని.. అలాగే హాస్టల్స్‌కి పర్మినెంట్ వార్డెన్‌లను నియమించాలని డిమాండ్ చేశారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ శిథిలా వ్యవస్థ లో ఉన్నటువంటి అన్ని హాస్టల్స్ వెంటనే పక్కనూతన భవనాలను ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్, టేకు మధు, అభినయ్ సాగర్, మణిదీప్ బాలాజీ, అభర్ సింగ్, శ్రీనాథ్, సంతోష్, సాయి కుమార్, అనిల్, సాయి, చరణ్ అఖిల్, ధనుంజయ్, అంబర్ సింగ్, వంశీ, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed