సింగరేణి పనులను అడ్డుకున్న గ్రామస్తులు

by Disha Web Desk 23 |
సింగరేణి పనులను అడ్డుకున్న గ్రామస్తులు
X

దిశ, రామగిరి : రామగుండం 3 ఓపెన్ కా‌స్ట్ 2 విస్తరణలో భాగంగా జరుగుతున్న పనులను గురువారం లద్నాపూర్ గ్రామస్తులు అడ్డుకున్నారు. సింగరేణి భూనిర్వాసిత గ్రామమైన లద్నాపూర్ లో అన్ని అర్హతలు ఉన్న 283 మందికి సింగరేణి యాజమాన్యం ఆర్అండ్ఆర్ ప్యాకేజీ చెల్లించట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంథని పెద్దపల్లి ప్రధాన రహదారి పక్కనే ఉన్న పోచమ్మ గుడి సమీపంలో పనులు నిర్వహిస్తుండడంతో గ్రామస్తులు వారించారు. తమకు న్యాయం జరిగేంత వరకు గుడి సమీపంలో ఎలాంటి పనులు నిర్వహించవద్దని ఆందోళన చేశారు.

సంఘటనా స్థలానికి చేరుకున్న రామగిరి ఎస్సై గ్రామస్తులు, సింగరేణి అధికారులతో చర్చించారు. అనంతరం పోషమ్మ గుడి సమీపంలో పనులు నిర్వహించమని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అయితే గతంలో సింగరేణి అధికారులు ఇదే పోచమ్మ గుడిలోని దేవున్ని రాత్రికి రాత్రే గుట్టు చప్పుడు కాకుండా తరలించారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఓసీపీ 2 లో భారీ ఎత్తున ఆందోళన నిర్వహించడంతో వెనక్కి తగ్గిన సింగరేణి అధికారులు గుడిలో విగ్రహాన్ని పునః ప్రతిష్ఠించారు.

Next Story