సినీ ఫక్కిలో ద్విచక్ర వాహనం అపహరణ

by Nallavelli.Anjaneyulu |

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని చింతలపల్లి గ్రామానికి చెందిన మరాఠీ వీరయ్య అనే రైతుకు చెందిన టీవీఎస్ ఎక్సెల్ ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని దుండగుడు అపహరించుకుపోయినట్లు తెలిపాడు.

సినీ ఫక్కిలో ద్విచక్ర వాహనం అపహరణ
X

దిశ, మానకొండూరు, శంకరపట్నం : కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని చింతలపల్లి గ్రామానికి చెందిన మరాఠీ వీరయ్య అనే రైతుకు చెందిన టీవీఎస్ ఎక్సెల్ ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని దుండగుడు అపహరించుకుపోయినట్లు తెలిపాడు. బాధితుని కథనం ప్రకారం.. చింతలపల్లె గ్రామ శివారులోని ప్రధాన రహదారి పక్కన తన టీవీఎస్ ఎక్సెల్ ద్విచక్ర వాహనాన్ని నిలిపి తన పొలం లో పనులు చేసుకుంటుండగా రహదారిపై నడుచుకుంటూ వచ్చిన ఓ గుర్తు తెలియని వ్యక్తి చూస్తుండగానే ద్విచక్ర వాహనాన్ని అపహరించుకుపోయినట్లు తెలిపాడు. వాహనం విలువ దాదాపు రూ.80వేల వరకు ఉంటుందని, నిందితుని కదలికలను సీసీ కెమెరాల లో పరిశీలించినట్లు తెలిపారు. చోరీ విషయాన్ని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

Next Story