Accident: త్రుటిలో తప్పిన పెను ప్రమాదం.. ఇద్దరు గర్భిణీలు సేఫ్

by Dishanational2 |
Two Pregnant women were Saved in Road Accident in Karimnagar
X

దిశ, కోనరావుపేట : Two Pregnant women were Saved in Road Accident in Karimnagar| శునకం( కుక్క) అడ్డం రావడంతో అదుపు తప్పి ఆటో బోల్తాపడింది. దీంతో ఆటోలో ఉన్న ప్రయాణికులకు తీవ్ర గాయలయ్యాయి. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా, కోనరావుపేట మండల కేంద్రంలోని చాంద్ నగర్ వద్ద మంగళవారం ఉదయం జరిగింది. సిరికొండ మండలం,పంది మడుగు గ్రామం నుండి సిరిసిల్లకు ఆటో వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు తెలిపారు. ఇక ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌కి, ఇద్దరు గర్భిణులకు స్వల్ప గాయాలు కాగా, అటు వైపుగా వెళ్తున్న జిల్లా జెడ్పీ చైర్పెర్సన్ న్యాల కొండ అరుణ - రాఘవరెడ్డి, కోనరావుపేట మండల ఎంపీపీ చంద్రయ్య ఘటనాస్థలంలో ఆగి క్షతగాత్రులను పరామర్శించి, అంబులెన్స్ ద్వారా సిరిసిల్ల జిల్లా ఆసుపత్రికి తరలించారు.


Next Story

Most Viewed