జిల్లాలో పలువురు ఎస్సైల బదిలీ

by Disha Web Desk 1 |
జిల్లాలో పలువురు ఎస్సైల బదిలీ
X

ఉత్తర్వులు జారీ చేసిన ఎస్పీ భాస్కర్

దిశ, జగిత్యాల ప్రతినిధి : జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వర్తిస్తున్న ఏడుగురు ఎస్సైలను ట్రాన్స్ ఫర్ చేస్తూ జిల్లా ఎస్పీ భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. మల్యాల ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న ఎం.చిరంజీవిని మేడిపల్లి పీఎస్ కు, బుగ్గారం ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న టి.అశోక్ ను మల్యాల పిఎస్ కు, మెట్ పల్లి, సీసీఎస్ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న ఎన్. సధాకర్ ను జగిత్యాల రూరల్ పీఎస్ కు, సీసీఎస్ జగిత్యాల ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న ఎస్. సందీప్ ను బుగ్గారం పీఎస్ కు, బీర్ పూర్ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న టి.అజయ్ ను రాయికల్ పీఎస్ కు బదిలీ చేశారు. మేడిపల్లి ఎస్ఐగా ఉన్న సుధీర్ రావు, రాయికల్ ఎస్సైలుగా ఉన్న కిరణ్ లను జగిత్యాల వీఆర్ కు బదిలీ చేశారు.Next Story