వేములవాడ రాజన్న ఆలయ ఉద్యోగులు బదిలీ

by Mahesh |
వేములవాడ రాజన్న ఆలయ ఉద్యోగులు బదిలీ
X

దిశ, వేములవాడ: తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మొట్టమొదటిసారిగా భారీ సంఖ్యలో ఉద్యోగుల బదిలీలు జరిగాయి. ఆలయంలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న ఇద్దరు ఏఈవోలతో పాటు ఏడుగురు పర్యవేక్షకులు, 8 మంది సీనియర్ అసిస్టెంట్లు, 10 మంది జూనియర్ అసిస్టెంట్లు, ఒక డిప్యూటీ ఈ.ఈ తో మొత్తం 28 మంది ఉద్యోగులను బదిలీ చేస్తూ మంగళవారం దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సాధారణ బదిలీల్లో భాగంగా ఇక్కడి ఉద్యోగులు ఎంచుకున్న ప్రాధాన్యతల మేరకు రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలలైన యాదగిరిగుట్ట, బాసర, భద్రాచలం, కొమురవెల్లి, కొండగట్టు పుణ్యక్షేత్రాలకు ఉద్యోగుల బదిలీలు జరిగినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా బదిలీ అయిన ఉద్యోగులు మూడు రోజుల్లో సంబంధిత ఆలయాల్లో బాధ్యతలు చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.



Next Story

Most Viewed