దొంగల బీభత్సం.. ఇంటి తాళాలు పగులగొట్టి చోరీ

by Aamani |
దొంగల బీభత్సం..  ఇంటి తాళాలు పగులగొట్టి చోరీ
X

దిశ, జగిత్యాల టౌన్ : జగిత్యాల పట్టణంలో దోపిడీ దొంగలు మరోసారి రెచ్చిపోయారు. గత కొన్ని రోజులుగా తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతు పోలీసులకు సవాల్ విసురుతున్నారు. అయితే తాజాగా సోమవారం రాత్రి పట్టణంలోని పోచమ్మ వాడ లో ఓ ఇంటి తాళాలు పగులగొట్టి దోపిడీకి పాల్పడ్డారు. ఇంటిలోని బీరువా లో ఉన్నరూ. 70 వేల నగదు తో పాటు మూడు తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed