- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
ఇవి తాత్కాలిక జాబితాలే

దిశ, గోదావరిఖని : ఇవి తాత్కాలిక జాబితాలే అని, అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకు ప్రభుత్వ పథకాలు అమలు అవుతాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పాలకుర్తి మండల కేంద్రం, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 38వ డివిజన్ సంజయ్ గాంధీనగర్ లో నూతన ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై నిర్వహించిన గ్రామ, వార్డు సభలలో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేసే ప్రతి సంక్షేమ పథకం అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకు అందేలా చర్యలు చేపట్టామని, సంక్షేమ పథకాల అమలు నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందన్నారు. ప్రస్తుతం తయారు చేసింది ప్రాథమిక జాబితా మాత్రమేనని, ఇందులో మార్పులు చేర్పులు ఉంటాయన్నారు. ప్రాథమికంగా ప్రకటించిన జాబితాలో ఒకటి రెండు మిస్ అయినా ఎటువంటి ఆందోళన అవసరం లేదని, దరఖాస్తు అందిస్తే వారం పది రోజులలో వాటిని విచారించి పథకాల లబ్ధి చేకూరుస్తామని అన్నారు.
2023 లో వచ్చిన ప్రజా పాలన దరఖాస్తులు, సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే వివరాలు, మీ సేవా దరఖాస్తులను క్రోడీకరించి రేషన్ కార్డులు కొత్తగా అందించేందుకు జాబితా సిద్ధం చేశామని, ఈ జాబితాను ప్రజలు పరిశీలించి అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని కోరారు. రేషన్ కార్డులకు అర్హులు ఇంకా ఎవరైనా ఉంటే దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రజా పాలన లో వచ్చిన ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తులు, ఇండ్ల సర్వే వివరాలను పరిశీలించి అర్హులను ఎంపిక చేశామని అన్నారు. వితంతువులు, దివ్యాంగులు, అత్యంత నిరుపేదలు ప్రాధాన్యతగా జాబితా సిద్ధం చేశామని అన్నారు. ఇందిరమ్మ ఇండ్లకు అర్హులైన ప్రతి ఒక్కరికి అందించడం జరుగుతుందని, ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోకపోతే దరఖాస్తు అందించాలని కోరారు. ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో ఎవరికైనా సొంత ఇండ్లు ఉండి ఉంటే సమాచారం అందిస్తే విచారణ చేస్తామని, ఇండ్లు ఉన్న వారి పేర్లు తొలగించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె.అరుణ శ్రీ,, పాలకుర్తి తహసీల్దార్ జ్యోతి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.