సమాజమే దేవాలయం.. ప్రజలే నా దేవుళ్లన్న మహానుభావుడు ఎన్టీఆర్ : స్పీకర్ పోచారం

by Disha Web Desk 1 |
సమాజమే దేవాలయం.. ప్రజలే నా దేవుళ్లన్న మహానుభావుడు ఎన్టీఆర్ : స్పీకర్ పోచారం
X

దిశ, బాన్సువాడ : తెలుగు ప్రజలను ఏకతాటిపైకి తీసుకొచ్చి పేద ప్రజలకు రాజకీయం అంటే తెలియజేసి, సమాజమే దేవాలయం.. ప్రజలే నా దేవుళ్లన్న మహానుభావుడు ఎన్టీఆర్ అని తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలోని వర్ని మండల కేంద్రంలో ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కాంస్య విగ్రహాన్ని ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణతో కలిసి శనివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్ వద్ద రాజకీయ ఓనమాలు దిద్దిన ఎందరో మహా నాయకులుగా ఏదిగారని గుర్తు చేశారు. ఆయన బాటలో మనందరం నడవడమే ఆయనకు మనమిచ్చే ఘన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్ రావు, ఎంపీ బీబీ పాటిల్, తుమ్మల నాగేశ్వరావు, ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Next Story