మా సమస్యలు పరిష్కరించండి.. మంత్రి హరీష్ రావుకు వినతి పత్రం

by Disha Web Desk 13 |
మా సమస్యలు పరిష్కరించండి.. మంత్రి హరీష్ రావుకు వినతి పత్రం
X

దిశ పెద్దపల్లి: గొర్రెల కాపర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలోని బృందం ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావును హైదరాబాద్ నివాసంలో కలిశారు. రాష్ట్రంలో యాదవులు, కురుమలు, గొర్రెల కాపరులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం మంత్రి హరీష్ రావు కు వినతి పత్రాన్ని సమర్పించారు. రానున్న బడ్జెట్‌లో గొల్ల కురుమల పాత్ర ఉండేలాగా బడ్జెట్‌ను తీర్చిదిద్దాలని విన్నవించారు.

తెలంగాణ రాష్ట్ర మంతటా 75% గొర్రెల పంపిణీ పథకాన్ని నగదు బదిలీ రూపంలో ఇవ్వాలని, గతంలో ఎన్సీడీసీ లో తీసుకున్న రుణాలను మాఫీ చేయాలని కోరారు. తనఖా పడ్డ ఆస్తులను విడిపించాలని లేదా వన్ టైం సెటిల్మెంట్ కింద రుణాలను కట్టే విధంగా అవకాశం ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో రెండు మండలాలకు ఒకటి చొప్పున గొర్రెల, మేకల మార్కెట్లను ఏర్పాటు చేస్తూ.. ఒక్కొక్క మార్కెట్‌కు రూ. 5 కోట్ల నిధులను కేటాయించి నిర్మాణాలను చేపట్టాలని కోరారు.

గొర్రెల కాపర్లు ప్రమాదవశాత్తు చనిపోతే ఇచ్చే ఎక్స్ గ్రేషియా రూ. 5 లక్షల వెంటనే అమలుపరచాలని మంత్రికి వినతి పత్రం అందిచారు. దీనికి మంత్రి స్పందిస్తూ.. ఎక్స్ గ్రేషియాకు సంబంధించినటువంటి 5 లక్షల రూపాయలను ఈ బడ్జెట్ సెషన్‌లోనే అమలుపరుస్తామని, గొఱ్ఱెల, మేకల మార్కెట్లకు సంబంధించి సుమారు రూ. 100 కోట్లను కేటాయించి.. మీట్ ప్రాసెసింగ్ యూనిట్లను, మార్కెట్ల నిర్మాణాలను దశలవారీగా చేపడతామని హామీ ఇచ్చినట్లు రాష్ట్ర బృందం సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు పోచబోయిన శ్రీహరి యాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం తిరుపతి యాదవ్, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు గుండెబోయిన అయోధ్య, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కాల్వ మల్లేశం, దేశ బోయిన సూర్య నారాయణ యాదవ్ యాదాద్రి భువనగిరి జిల్లా, రాష్ట్ర నాయకులు శిలారపు పర్వతాలు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.



Next Story