న్యాయం కోసం త‌ప‌న‌.. రాహుల్ మృతి పై వెల్లువెత్తుతున్న క‌న్నీటి ఆక్రంద‌న‌..!

by Nallavelli.Anjaneyulu |

ఒక నిండు ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయింది. ఒక కన్నతల్లి కడుపుకోత, ఒక కుటుంబానికి తీరని లోటు.. ఇప్పుడు వేలాది గుండెల్లో ఆవేదనగా, ఆపై ఒకే ఒక నినాదంగా మారుతోంది.

న్యాయం కోసం త‌ప‌న‌.. రాహుల్ మృతి పై వెల్లువెత్తుతున్న క‌న్నీటి ఆక్రంద‌న‌..!
X

దిశ, కోరుట్ల రూరల్ : ఒక నిండు ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయింది. ఒక కన్నతల్లి కడుపుకోత, ఒక కుటుంబానికి తీరని లోటు.. ఇప్పుడు వేలాది గుండెల్లో ఆవేదనగా, ఆపై ఒకే ఒక నినాదంగా మారుతోంది. ఆ నినాదమే "రాహుల్‌కు న్యాయం కావాలి జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని అయిలాపూర్ గ్రామ ​యువకుడు రాహుల్ అకాల మృతి కేవలం ఒక కుటుంబానికే పరిమితమైన శోకం కాదు. అది సమాజం మనస్సాక్షిని కదిలిస్తున్న హృదయవిదారక ఘటన. నిన్నటివరకు తమ మధ్య నవ్వుతూ, ఆడుతూ తిరిగిన యువకుడు ఈరోజు లేడనే నిజాన్ని నెటిజన్లు జీర్ణించుకోలేకపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా మానవత్వం ఒక్కటై నినదిస్తోంది.

​గొంతుకలైన నెటిజన్లు.. మిన్నంటుతున్న పోస్టులు..


​ప్రస్తుతం సోషల్ మీడియా అంతటా రాహుల్ కు న్యాయం కావాలి అనే పోస్టులు మారుమోగిపోతున్నాయి. ఇదొక కేవలం ప్రచారం కాదు... రాహుల్ కుటుంబానికి తామున్నామంటూ సమాజం అందిస్తున్న భరోసా. వైరల్ అవుతున్న ప్రతి పోస్టర్ వెనుక, ప్రతి ట్వీట్ వెనుక ఒకే ఒక్క ఆవేదన కనిపిస్తోంది.

అసలేం జరిగింది ?

​ప్రజలు, నెటిజన్లు ఎంతో ఆవేదనతో కొన్ని కీలక ప్రశ్నలను అధికారుల ముందుంచుతున్నారు. రాహుల్ మృతి వెనుక దాగున్న అనుమానాలను నివృత్తి చేసి, పూర్తి వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాలి. ​వైద్య నివేదికలు, దర్యాప్తు వివరాలను దాచకుండా బహిర్గతం చేయాలని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఘటనకు బాధ్యులైన వారు ఎంతటివారైనా సరే, వారిపై సమగ్ర విచారణ జరిపి చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని నేటిజన్లు కోరుతున్నారు. రాహుల్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదు" అంటూ నెటిజన్లు పెడుతున్న పోస్టులు ప్రతి ఒక్కరినీ కదిలిస్తున్నాయి.

​అధికారుల వైపు చూస్తున్న బాధితులు

​ఈ సున్నితమైన అంశం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరి మదిని తొలుస్తోంది. రాహుల్ మరణంపై ఉన్న ముసుగు తొలగిపోవాలని, బాధితులకు తక్షణమే న్యాయం జరగాలని ప్రతి గుండె కోరుకుంటోంది. ఒక కన్నతల్లి కన్నీటికి, ఒక యువకుడి ఆత్మకు శాంతి చేకూరాలంటే సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి, పారదర్శకమైన విచారణ జరపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Next Story