చేసిన పనులకు బిల్లులు రాక.. రాజీనామా చేసిన సర్పంచ్..

by Disha Web Desk 23 |
చేసిన పనులకు బిల్లులు రాక.. రాజీనామా చేసిన సర్పంచ్..
X

దిశ,తిమ్మాపూర్ : గ్రామ ప్రజల ఆశీస్సులతో సర్పంచ్ గా గెలుపొంది, గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు ముందుకు సాగిన తరుణంలో ఎన్నెన్నో అవాంతరాలను అధిగమించి ప్రజా సేవ చేసేందుకు గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు బీఆర్ఎస్ పార్టీలో చేరితే ఏళ్ళు గడిచినా చేసిన పనులకు బిల్లులు రాక పార్టీలో చేరినా ఫలితం లేకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ కి రాజీనామా చేస్తున్నట్లు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెం పల్లి గ్రామ మాజీ సర్పంచ్ మేడి అంజయ్య తెలిపారు. బీఆర్ఎస్ పదవికి శుక్రవారం రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన ఆ పార్టీ మండల అధ్యక్షునికి లేఖ రాశారు.

ఈ సందర్భంగా ఆయన పలు అంశాలను లేఖ లో పొందు పరిచారు.గత ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న సర్పంచ్ లను విస్మరించి అప్పుల పాలు చేయడం మూలంగా కొంతమంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారని మరికొంత మంది భార్య, పిల్లల ఒంటిపై ఉన్న నగలను తాకట్టు పెట్టి మరీ ప్రజలకు ఇచ్చిన మాట కోసం పనులను పూర్తి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది సర్పంచులు చేసిన అప్పులు తీర్చలేక, చేసిన పనులకు పెండింగ్ బిల్లులు ఎప్పుడు వస్తాయో తెలియక దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారని పేర్కొన్నారు. ఇన్ని అవాంతరాల నడుమ తాను ఇంకా ఈ బీఆర్ఎస్ పార్టీలో కొనసాగలేనని లేఖలో తెలిపారు.


Next Story

Most Viewed