హోంగార్డ్ ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తా : మంత్రి గంగుల కమలాకర్

by Shiva |
హోంగార్డ్ ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తా : మంత్రి గంగుల కమలాకర్
X

దిశ, కరీంనగర్ టౌన్ : తెలంగాణ రాష్ట్రంలో పని చేస్తున్న హోంగార్డులను క్రమబద్ధీకరించాలని కోరుతూ కరీంనగర్ మీసేవా కార్యాలయంలో బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కు హోంగార్డులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా హోంగార్డులు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చాలా సందర్భాల్లో హోంగార్డులను కానిస్టేబుళ్లుగా చేస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. విధి నిర్వహణలో కానిస్టేబుళ్లతో సమానంగా హోంగార్డులు తమ విధులను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.

ప్రభుత్వం నుంచి లభించే జీవిత బీమా, ఆరోగ్య భద్రత, ఉద్యోగ భద్రత, రిటైర్మెంట్ బెనిఫిట్స్ లాంటివి హోంగార్డుకు లేకపోవడంతో వారి పదవీ విరమణ తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వినతిపత్రంలో వెల్లడించారు. సానుకూలంగా స్పందించిన మంత్రి గంగుల కమలాకర్ హోంగార్డుల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. హోంగార్డు సేవలను ఆయన త్వరలోనే గుర్తించి వారికి శుభవార్త చెబుతారని మంత్రి గంగుల ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed