సీఎం సభ కోసం పోలీసుల కష్టాలు..!

by Dishafeatures2 |
సీఎం సభ కోసం పోలీసుల కష్టాలు..!
X

దిశ, జగిత్యాల టౌన్: ప్రజలకు రక్షణ కల్పించడంలో ఏమోగానీ రాజకీయ నాయకులకు రక్షణ కల్పించడంలో మాత్రం పోలీసులు నానా కష్టాలు పడుతున్నారు. వారికి బందోబస్తు ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. తాజాగా జగిత్యాలలో సీఎం కేసీఆర్ సభ బందోబస్తులో పాల్గొనేందుకు పోలీసులు చాలా కష్టాలు పడుతున్నారు. బందోబస్తు కోసం ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి చాలా మంది పోలీసులకు విధులు కేటాయించారు. ఈ క్రమంలోనే వారంతా ఒక్క రోజు ముందే జగిత్యాలకు చేరుకున్నారు. అయితే మీటింగ్ జరిగే ప్రదేశం వారికి బస కల్పించిన ప్రాంతం నుంచి చాలా దూరం ఉంది. మీటింగ్ ప్రదేశానికి వెళ్లడానికి పోలీసులకు ఎలాంటి వాహనాలు ఏర్పాటు చేయలేదు. పైగా ప్రైవేట్ వాహనాలు కూడా నడవడం లేదు. దీంతో వారంతా నడిచే వెళ్తున్నారు. కనీసం తిరుగప్రయాణంలోనైనా వాహనాలు పెడుతారో లేదో చూడాలని పోలీసులు చెబుతున్నారు.

Also Read...

జగిత్యాల బస్టాండ్ లో ప్రయాణికుల పడిగాపులు


Next Story

Most Viewed