వైన్ షాపులకు బిగ్ షాక్.. ఆబ్కారీ శాఖ సంచలన నిర్ణయం

by srinivas |
వైన్ షాపులకు బిగ్ షాక్.. ఆబ్కారీ శాఖ సంచలన నిర్ణయం
X

ఎల్లారెడ్దిపేట మండలంలోని వైన్స్ దుకాణాల పక్కన ఉన్న పర్మిట్ రూంలు బార్లను తలపిస్తున్నాయి. యజమానులు మందుబాబుల నుంచి ముక్కు పిండి మరి వసూళ్లు చేస్తున్నారు. దీంతో పర్మిట్ రూంలలో మందు తాగిన వారి జేబులకు చిల్లులు పడుతున్నాయి. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో రెండు వైన్స్ దుకాణాలు, గొల్లపల్లిలో మరో రెండు వైన్స్ దుకాణాలను నిర్వహిస్తున్నారు. వీటికి అనుబంధంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం మద్యం తాగే వారు ఆరు బయట మద్యం సేవించకుండా ఉండడం కోసం ఆబ్కారీ శాఖ పర్మిట్ రూంలకు ప్రత్యేకంగా అనుమతులు ఇచ్చారు. కానీ పర్మిట్ రూంలలో మద్యం తాగే వారి కోసం మూత్రశాలలు ఏర్పాటు చేయాల్సిన సంబంధిత వైన్స్‌ల యజమానులు ఆబ్కారీ శాఖ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. దీంతో మద్యంప్రియులతో కళకళలాడుతున్న వైన్సులు వారికి సౌకర్యాలు కల్పంచడంలో చిన్నచూపు చూస్తున్నాయి.

- దిశ, ఎల్లారెడ్దిపేట

దిశ, ఎల్లారెడ్దిపేట : ఎల్లారెడ్దిపేట మండలంలోని వైన్స్ దుకాణాల పక్కన ఉన్న పర్మిట్ రూంలు భార్లను తలపిస్తున్నాయి. యజమానులు మందుబాబుల నుంచి ముక్కు పిండి మరి వసూళ్లు చేస్తున్నారు. దీంతో పర్మిట్ రూంలలో మందు తాగిన వారి జేబులకు చిల్లులు పడుతున్నాయి. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కేంద్రంలో రెండు వైన్స్ దుకాణాలు, గొల్లపల్లిలో మరో రెండు వైన్స్ దుకాణాలను నిర్వహిస్తున్నారు. వీటికి అనుబంధంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం మద్యం తాగే వారు ఆరు బయట మద్యం సేవించకుండా ఉండడం కోసం ఆబ్కారీ శాఖ పర్మిట్ రూంలకు ప్రత్యేకంగా అనుమతులు ఇచ్చారు. కానీ వైన్స్‌లను కేటాయించినప్పుడే తప్పకుండా పర్మిట్ రూంలలో మద్యం తాగే వారి కోసం మూత్రశాలలు ఏర్పాటు చేయాల్సిన సంబంధిత వైన్స్‌ల యజమానులు ఆబ్కారీ శాఖ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు.

మూత్రశాలలు లేక ఇబ్బందులు...

పర్మిట్ రూంలలో మూత్రశాలలు లేకపోవడంతో ఆరుబయట మూత్ర విసర్జన చేస్తుండడంతో దారి వెంబడి రాకపోకలు సాగించే వారు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం పాఠశాలలకు విద్యార్థులను తీసుకెళ్లడానికి వచ్చే తల్లిదండ్రులు మందుబాబులు రోడ్డుపై మూత్ర విసర్జన చేస్తుండడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దారి వెంబడి వెళ్లే మహిళలు ముక్కున వేలేసుకుని వెళ్తున్నారు. మరి ముఖ్యంగా మహిళలు మందుబాబుల వికృత చేష్టలతో పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతంగా ఉన్నాయని పలువురు వాపోతున్నారు. ఎల్లారెడ్డిపేట మొదటి వైన్స్ బైపాస్ రోడ్డులో ఉన్న వైన్స్ వల్ల తాము చాలా ఇబ్బందులు పడుతున్నామని, ఈ వైన్స్ వల్ల మందు బాబులు పీకల వరకు మద్యం సేవించి రోడ్డుపైనే మూత్ర విసర్జన చేస్తుండగా అనేక ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు తెలిపారు.

ముఖ్యంగా ఈ వైన్స్‌కు సమీపంలో ఓ ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఉంది. పాఠశాలకు వారి పిల్లలను ఇంటికి తీసుకుపోయే సమయంలో మందు బాబులు చేస్తున్న ఆగాడాలతో విసుగు చెందుతున్నామని మహిళలు వాపోతున్నారు. ఇక్కడ వైన్స్ నడపడంతో పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు మందుబాబుల అరుపులతో ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వైన్స్‌ను అక్కడి నుంచి తొలగించాలని, అదే విధంగా గొల్లపల్లిలోని రెండు వైన్స్‌ల సమీపంలో ప్రైవేట్ జూనియర్ కళాశాల ఉందని, మందు బాబుల చేష్టలతో తాము ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు వాపోతున్నారు. పర్మిట్ రూంలలో మూత్రశాలలు ఏర్పాటు చేయకపోవడంతో దారి వెంబడి వెళ్లే ప్రజలు దుర్గంధం భరించలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆబ్కారీ శాఖ అధికారులు వైన్స్ దుకాణాల్లో పర్మిట్ రూంలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

పరిశీలించి చర్యలు తీసుకుంటాం

ఆబ్కారీ స్టేషన్ పరిధిలో గల అన్ని వైన్స్‌లను తనిఖీలు చేస్తాం. అనుబంధంగా ఉన్న పర్మిట్ రూంలలో మూత్రశాలలు లేని వాటిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.

- శ్రీనివాస్, ఆబ్కారీ సీఐ, ఎల్లారెడ్డిపేట

Advertisement

Next Story

Most Viewed