నిబంధనలకు నీళ్లు.. మూడు రోజులైనా తొలగించని ఫ్లెక్సీలు

by Javid Pasha |
నిబంధనలకు నీళ్లు.. మూడు రోజులైనా తొలగించని ఫ్లెక్సీలు
X

దిశ, జమ్మికుంట: జమ్మికుంట పట్టణంలోని ప్రధాన కూడలి గాంధీ చౌక్ చౌరస్తాకు దశాబ్దాల చరిత్ర ఉంది. ఇక్కడ ఉన్న గాంధీ మహాత్ముడి విగ్రహానికి ఈ ప్రాంతంలోని అన్ని పార్టీలు, సంఘాలు గౌరవం ఇస్తాయి. గాంధీ మహాత్ముడి విగ్రహం చుట్టూ ఉన్న ఫెన్సింగ్ కి పార్టీలు, సంఘాలు తమ జెండాలు కట్టి కార్యక్రమాలను నిర్వహిస్తాయి. అయితే ఆ జెండాలు, ఫ్లెక్సీలను జమ్మికుంట మున్సిపల్ పాలకవర్గం సిబ్బంది ఒక్కరోజు మాత్రమే ఉంచుతారు. మరుసటి రోజు వాటిని తొలగిస్తారు. అయితే మూడు రోజుల కిందట బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌషిక్ రెడ్డి జన్మదిన సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు పట్టణంలో భారీగా జెండాలు, ఫ్లెక్సీలు కట్టారు. కానీ మూడు రోజులైన వాటిని తొలగించకపోవడంతో ప్రతిపక్ష పార్టీలు, సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గాంధీజీ కంటే ఎత్తైన ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి జాతిపితను అవమానించారని, సీసీ కెమెరాలను కప్పేస్తూ ఫ్లెక్సీలు, జెండాలు ఏర్పాటు చేశారని మండిపడుతున్నారు. తమకో రూల్ అధికారి పార్టీ కార్యకర్తలకో రూలా అని ప్రశ్నిస్తున్నారు. తక్షణమే ఆ ఫ్లెక్సీలు, జెండాలను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.

Next Story

Most Viewed