ప్రారంభోత్సవమేమో అక్కడ.. అరెస్టులేమో ఇక్కడ.. ప్రభుత్వంపై మండిపడుతున్న ప్రతిపక్షాలు

by Disha Web Desk 20 |
ప్రారంభోత్సవమేమో అక్కడ.. అరెస్టులేమో ఇక్కడ.. ప్రభుత్వంపై మండిపడుతున్న ప్రతిపక్షాలు
X

దిశ, రామడుగు : ప్రారంభోత్సవం అక్కడ అయితే అరెస్టులేమో ఇక్కడా అని ప్రభుత్వం పై కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికార పార్టీ నాయకుల కార్యక్రమాలు ఎక్కడ జరిగిన కాంగ్రెస్ పార్టీ నాయకులను ముందస్తు అరెస్టులు చేపట్టడం ఒక ఫ్యాషన్ గా అయ్యిందని కాంగ్రెస్ బీసీ సెల్ చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్ ఎద్దేవా చేశారు. త్వరలోనే బీఆర్ఎస్ పాలనకు ప్రజలు స్వస్తి పలికి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పీఠం ఎక్కించడం ఖాయమని అన్నారు.

అలాగే కేటీఆర్ కరీంనగర్ పర్యటన సందర్భంగా కార్యక్రమం కరీంనగర్లో జరిగితే రామడుగులో కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయడం సిగ్గుచేటు అని అన్నారు. అరెస్టు అయిన వారిలో స్టేట్ ఎస్సీ సెల్ చైర్మన్ రాజమల్లన్న, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, బీసీ సెల్ అధికార ప్రతినిధి రాయుడు, మండల కాంగ్రెస్ చేనేత అధ్యక్షులు రంగన్న, రామడుగు గ్రామ శాఖ అధ్యక్షులు శ్రీను తదితరులు ఉన్నారు.

Next Story