యువత చేతుల్లో దేశ భవిష్యత్తు : జిల్లా కలెక్టర్

by Disha Web Desk 23 |
యువత చేతుల్లో దేశ భవిష్యత్తు : జిల్లా కలెక్టర్
X

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని యువత ప్రతి ఒక్కరు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పిలుపునిచ్చారు . ఆదివారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గంజాయి నిర్మూలనపై 5కే రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ జండా ఊపి 5కే రన్ ని ప్రారంభించారు. స్థానిక అంబేద్కర్ చౌక్ నుండి చందంపేట కల్యాణ లక్ష్మి వరకు అంబేద్కర్ చౌక్ వద్ద వరకు కొనసాగింది. జిల్లాలోని మండలాల నుండి యువతి యువకులు, విద్యార్థిని విద్యార్థులు, పెద్దలు, పోలీస్ సిబ్బంది, పాత్రికేయులు, చిన్నారులు, పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు.

సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎస్పీలు మాట్లాడుతూ దేశ భవిష్యత్తును నిర్ణయించేది యువత అని, అలాంటి యువత డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్ధాలకు బానిసలై వారి భవిష్యత్తుని నెట్టేసుకుంటున్నారని అన్నారు. భావి జీవితానికి అవరోధంగా నిలుస్తూన్న మత్తు పదార్థాలను సమాజం నుండి పూర్తిగా నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ నడుం బింగించాలని అన్నారు. సిరిసిల్ల జిల్లాలో యువత మత్తు పదార్థాల బారిన పడకుండా యువతను ఉత్తేజ పరిచే విధంగా మాధకద్రవ్యాల నిర్మూలన అవగాహన 5కె రన్ ఏర్పాటు చేయడం జరిగిందనన్నారు.యువత పురోగతికి అవరోధంగా నిలుస్తున్న గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలను నియంత్రించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తించి, ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని సమూలంగా డ్రగ్స్, గంజాయి నిర్మూలించడంలో భాగస్వామ్యం కావాలన్నారు.

జిలాల్లో గంజాయి, డ్రగ్స్ నిర్ములనకు జిల్లాలోని కళాశాలలో, పాఠశాలలో విద్యార్థినీ, విద్యార్థులతో యాంటీ డ్రగ్స్ క్లబ్స్ ఏర్పాటు చేసి అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా జిల్లాలో డ్రగ్స్, గంజాయి కి అలవాటు పడిన వారిని సన్మార్గంలో నడిపించడానికి డి-ఆడిక్షన్ సెంటర్ ఏర్పాటు మానసిక వైద్యుల ద్వారా చికిత్స అందించడం జరుగుతుందన్నారు. అనంతరం పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు.కార్యక్రమంలో డీఎస్పీ లు,సీ.ఐ లు,ఆర్.ఐ లు,ఎస్.ఐ లు,డాక్టర్ లు,యువతి, యువకులు, పాత్రికేయులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.


Next Story

Most Viewed