గుండు పిన్ను మొనపై వినాయకుడి రూపం.. మైక్రో ఆర్టిస్ట్ ప్రతిభ

by Disha Web Desk 1 |
గుండు పిన్ను మొనపై వినాయకుడి రూపం.. మైక్రో ఆర్టిస్ట్ ప్రతిభ
X

దిశ, జగిత్యాల ప్రతినిధి : వినాయక చతుర్ధిని పురస్కరించుకుని జగిత్యాలకు చెందిన సూక్ష్మ కళాకారుడు తన ప్రతిభ మరోసారి చాటాడు. గణపతి నవరాత్రుల సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన డాక్టర్ గుర్రం దయాకర్ గుండు పిన్నుపై వినాయకుడి రూపాన్ని పొందుపరిచారు. చంద్రయాన్-3 విజయవంతం, జీ 20 దేశాల సదస్సుకు భారతదేశం వేదికైన నేపథ్యంలో భారతదేశ జెండా పట్టుకుని ఉన్న వినాయకుని రూపాన్ని జీ20 లోగోతో తయారు చేయడం ప్రత్యేకత సంతరించుకుంది. 6 మి.మీ. పొడవు, 4 మీ.మీ. వెడల్పుతో ఈ కళాకృతిని రూపొందించడం విశేషం. అత్యంత సూక్ష్మంగా గుండు పిన్ను మొనపై కొలువుదీరిన లంబోదరుడి తయారీకి ఎనిమిది గంటల సమయం పట్టినట్లు దయాకర్ తెలిపారు. సూక్ష్మ రూప వినాయకుడిని రూపొందించిన దయాకర్ ను పలువురు అభినందించారు.

Next Story

Most Viewed