- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
పరిశ్రమల సహకారంతోనే ప్రగతి బాటలో జిల్లా : కలెక్టర్ ఆర్.వీ కర్ణణ్
దిశ, కరీంనగర్ : మారుతున్న సామాజిక, పారిశ్రామిక, ఆర్థిక పోకడలకు తగ్గట్లుగా పరిణితిని సాధిస్తూ.. ప్రగతి బాటలో పయనించాలంటే అది కేవలం పరిశ్రమల తోడ్పాడు ఉంటేనే సాధ్యమవుతోందని జిల్లా కలెక్టర్ ఆర్.వీ కర్ణన్ అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ధి వేడుకల్లో భాగంగా మగళవారం 4వ రోజు తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవం కార్యక్రమాన్ని గ్రానేట్ అసోసియోషన్, ఐటీ టవర్, కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆర్.వీ. కర్ణన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2002లో కరీంనగర్ జిల్లాలో చిన్నగా ప్రారంభమైన గ్రానేట్ వ్యాపారం అంచలంచలుగా ఎదిగి 2023 నాటికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారం చేసే దశకు చేరిందన్నారు. ప్రస్తుతం తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన దాదాపు 15 వేల నుంచి 20 వేల మందికి ఉపాధిని జిల్లాలో దొరకుతోందని అన్నారు. కరీంనగర్ లో లభించే గ్రానేట్ భాతరదేశం ఎక్కడ వెతికినా కనిపించదని అన్నారు. తెలంగాణ ఆవిర్భావానికి పూర్వం పరిశ్రమను స్థాపించాలంటే అనేక రకాల అనుమతులు పోందాల్సి వచ్చేదన్నారు.
అనుమతులు పొంది పరిశ్రమను స్థాపించినా.. ఉత్పత్తి వ్యయం భారం కావడంతో అనేక పరిశ్రమలు ఆదిలోనే మూతపడేవని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట ఆవిర్భావం అనంతరం టీఎస్ ఐపాస్ విధానాన్ని ప్రవేశపెట్టడంతో పరిశ్రమల స్థాపనకు ఆన్ లైన్ వేదికగా ఒకే ఒక ధరఖాస్తు సమర్పించడం వల్ల అన్ని శాఖల అనుమతులను పొందడం సులభతరమైందని తెలిపారు. గతంలో పర్యటించిన నీతి అయోగ్ బృందం అన్ని వసతులు కలిగిన కరీంనగర్ జిల్లాను మోడల్ జిల్లాగా గుర్తించిందని తెలిపారు. కరీంనగర్ జిల్లాలో నిర్వహిస్తున్న గ్రానేట్ వ్యాపారాన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింత అభివృద్దిని సాధించాలని ఆకాంక్షించారు.
అనంతరం ఐటీ టవర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్, జిల్లాలో ఏర్పాటు చేసిన ఐటీ టవర్ వేదికగా కృషి చేసిన టెక్కీలు చాలామంది ప్రస్తుతం మంచి స్థానాల్లో నిలిచారని తెలిపారు. అభివృద్ది చెందుతున్న టెక్నాలజీకి అనుగుణంగా పరిణితి చెందాలన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ.. కరీంనగర్ జిల్లాలో పరిశ్రమ స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం అనేక విధాలుగా సహకారాలను అందించిందని తెలిపారు.
గడిచిన పదేళ్లలో కరీంనగర్ కార్పొరేషన్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొరకు రూ.2,500 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్, ట్రైనీ కలెక్టర్ లేనిన్ వాట్సల్ టోప్పో, జడ్పీ సీఈవో ప్రియాంక, కార్మిక శాఖ ఉప కమిషనర్ రమేష్ బాబు, చేనేత శాఖ సహాయ సంచాలకుడు, చేనేత సంఘం అధ్యక్షుడు రాంచందర్, రైస్ మిల్లర్ అసోసియోషన్ అధ్యక్షుడు నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.