మణిపూర్ నిందితులను కఠినంగా శిక్షించాలి

by Shiva |
మణిపూర్ నిందితులను కఠినంగా శిక్షించాలి
X

దిశ, శంకరపట్నం : మణిపూర్ లో జరిగిన అమానుష, అసాంఘిక, అప్రజాస్వామిక ఘటనకు నిరసనగా మండల కేంద్రంలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశంలో ప్రజా సంఘాల బీసీ సంక్షేమ సంఘాల మండలాధ్యక్షుడు బొంగోని అభిలాష్ మాట్లాడారు. మణిపూర్ లో మహిళలని వివస్త్రను చేసి ఉరేగుంపుగా తీసుకెళ్లడం అత్యంత విషాదకర ఘటన.. అందుకు కారణమైన బాధ్యలను వెంటనే శిక్షించాలి డిమాండ్ చేశారు. శాంతి భధ్రతల పర్యవేక్షించాలని అవసరమయితే గవర్నర్ పాలనా పెట్టాలన్నారు. ప్రజా సంఘాలు ప్రజాస్వామ్యవేత్లు అంతా ఏకతాటి పైకి వచ్చి ఇలాంటి ఘటనను ఖండించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబెర్ పూరేళ్ల ప్రశాంత, కరీంనగర్ బీసీ సంఘం ఉపాధ్యక్షుడు బొంగొని శ్రవణ్, నాయకులూ సాగర్, మణిసాయి న్యాలం, అక్షయ్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed