ఆ ఆఫీసర్ మాకొద్దు.. సీడీఎంకు సరెండర్ చేద్దాం..

by Disha Web Desk 23 |
ఆ ఆఫీసర్ మాకొద్దు.. సీడీఎంకు సరెండర్ చేద్దాం..
X

దిశ, జగిత్యాల టౌన్ : అవినీతికి పరాకాష్టగా మారిన ఆ ఆఫీసర్ మాకొద్దని, సీడీఎంకు సరెండర్ చేద్దామని ఓ కౌన్సిలర్ గోడు వెల్లబోసుకోవడంతో బల్దియా కౌన్సిల్ శుక్రవారం తీర్మానం చేసింది. ఇదిలా ఉంటే ఈ తీర్మాణ పత్రాన్ని రద్దు చేసేందుకు సహకరించాలని ఏకంగా కీలక నేతకు రూ. 30 వేలు ఆఫర్ చేసినట్లు ప్రచారం నడవడం హాట్ టాపిక్ గా మారింది. ఆది నుండి వివాదస్పదుడిగా ఉన్న రెవెన్యూ సెక్షన్ లో పని చేస్తున్న ఆఫీసర్ కు ఇటీవల కోర్టు తీర్పును అనుసరిస్తూ మ్యుటేషన్ చేయాలని ఓ కౌన్సిలర్లు దరఖాస్తు చేసుకున్నాడు.

రూల్స్ ప్రకారం చేయకుండా కొర్రిలు పెడుతూ డబ్బులు డిమాండ్ చేయటంతో సదరు కౌన్సిలర్ ను ఇబ్బంది పెడుతూ వచ్చాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమం లో సరెండర్ చేయాలని చేసిన తీర్మాణ పత్రాన్ని ఉన్నతాధికారులకు అందించకుండా ఉండేందుకు సదరు ఆఫీసర్ పాలక వర్గం లోని కీలక నేత కు ఆఫర్ చేసినట్లు కూడా ప్రచారం నడుస్తోంది.


Next Story

Most Viewed