విద్యా వ్యవస్థలో తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్ మోడల్

by Sridhar Babu |
విద్యా వ్యవస్థలో తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్ మోడల్
X

దిశ, గంగాధర : విద్యా వ్యవస్థలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దామని, గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా డైట్ చార్జీలు 40%, కాస్మోటిక్ చార్జీలు 200% పెంచిన ఘనత తమ ప్రభుత్వానిదే అని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. మండల కేంద్రంలోని ఎంజేపీటీ బీసీ సంక్షేమ పాఠశాల బాలుర, బాలికల పాఠశాలల్లో శనివారం కొత్త డైట్ చార్ట్ ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద, మధ్య తరగతి విద్యార్థులు అన్ని హాస్టల్లో చదువుకుంటారు కనుక డైట్, కాస్మెటిక్ చార్జీలు పెంచి తక్షణమే అమల్లోకి తెచ్చామన్నారు. రాజకీయ నాయకుల, అధికారుల పిల్లలు ఏ భోజనం అయితే తీసుకుంటున్నారో అలాంటిదే హాస్టల్లో కూడా అందించాలని సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు.

గతంలో మాటలు చెప్పిన ప్రభుత్వమే ఉన్నాయి కానీ ఏనాడూ చేతల్లో చూపించలేదని ఆరోపించారు. విద్యావ్యవస్థలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఒక రోల్ మోడల్ గా మారుతుందన్నారు. అగ్ర రాజ్యాల్లో ఎలాంటి విద్యను అభ్యసిస్తారో భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం కూడా అదే విధంగా విద్యనందించడంలో అతిశయోక్తి లేదు. దాంట్లో భాగంగానే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను అడాప్ట్ వేసుకున్నామని, త్వరలో చొప్పదండి నియోజకవర్గం కూడా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ రాబోతుందని తెలిపారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ జెడ్పీ సీఈఓ శ్రీనివాస్, ఎంపీడీఓ రాము, సీఐ రాజేందర్ గౌడ్, ఎస్సై నరేందర్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed