నంది మేడారం పంప్ హౌస్ అద్భుతం.. హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్వల్ భూయాన్

by Disha Web |
నంది మేడారం పంప్ హౌస్ అద్భుతం.. హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్వల్ భూయాన్
X

దిశ, పెద్దపల్లి: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా పెద్దపల్లి జిల్లా నంది మేడారంలో నిర్మించిన పంప్ హౌస్ అద్భుత నిర్మాణమని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అన్నారు. ఆదివారం ధర్మారం మండలంలోని నంది మేడారం గ్రామంలో పర్యటించిన రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నంది మేడారం పంప్ హౌస్ ను సందర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్, నంది మేడారం పంప్ హౌస్ వరకు జరిగిన నిర్మాణాలను ఇరిగేషన్ ఈ.ఎన్.సి. నల్లా వెంకటేశ్వర్లు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి వివరించారు. నంది మేడారం పంప్ హౌస్, అండర్ గ్రౌండ్ సర్జ్ పూల్, సబ్ స్టేషన్, డెలివరీ సిస్టమ్ లను పరిశీలించిన హై కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి.. మరో లోకంలోకి వచ్చినట్లు ఉందని, అద్బుత నిర్మాణాలు పూర్తి చేసిన ప్రభుత్వానికి, ఇంజనీర్లను అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్ నవీన్ రావు, అడ్మినిస్ట్రేషన్ జడ్జి జస్టిస్ ఎన్.వి.శ్రవణ్ కుమార్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.సంగీత సత్యనారాయణ, రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి, ఈ.ఎన్.సి. ఎన్.వెంకటేశ్వర్లు, న్యాయాధికారులు, ఈ.ఈ. ఎన్.శ్రీధర్, సంబంధిత అధికారులు ఉన్నారు.
Next Story