సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌పై సస్పెన్షన్ వేటు

by Disha Web Desk 23 |
సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌పై సస్పెన్షన్ వేటు
X

దిశ, సుల్తానాబాద్ : సుల్తానాబాద్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏప్రిల్ 18న సుల్తానాబాద్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో అందించిన అల్పాహారం వికటించడంతో 24 మంది విద్యార్థులు అస్వస్థతకు గురి కావడం జరిగింది. దీనిపై జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి అందించిన నివేదిక ప్రకారం గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ అలసత్వం ఉందని ప్రాథమికంగా భావించిన కలెక్టర్ ప్రిన్సిపాల్ ఎస్. సత్య ప్రసాద్ రాజ్ ను సస్పెండ్ చేశారు.

గురుకుల పాఠశాల కేర్ టేకర్ , అసిస్టెంట్ కేర్ టేకర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన కలెక్టర్ జరిగిన సంఘటనపై సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించారు. సస్పెన్షన్ కాలంలో ప్రిన్సిపాల్ సత్య ప్రసాద్ అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్ వదిలి వెళ్ళవద్దని, సుల్తానాబాద్ సాంఘిక సంక్షేమ పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ సిహెచ్. రామ స్వామి కి ప్రిన్సిపాల్ గా అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.



Next Story

Most Viewed