పుట్ట లింగమ్మ ట్రస్ట్ అధ్వర్యంలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం

by Dishafeatures2 |
పుట్ట లింగమ్మ ట్రస్ట్ అధ్వర్యంలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం
X

దిశ, ముత్తారం: ప్రభుత్వ పాఠశాలలో కాలేజీలలో చదువుకుంటున్న ప్రతి పేద విద్యార్థి కడుపు నిండా భోజనం చేసి కష్టపడి చదువుకోవాలని జడ్పీ చైర్మన్ పుట్ట మధు ఆకాంక్ష అని ముత్తారం ఎంపీపీ జక్కుల ముత్తయ్య అన్నారు. సోమవారం ఆయన మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పుట్ట లింగమ్మ ట్రస్ట్ అధ్వర్యంలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంను ప్రాంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలతో పేదలకు లబ్ధి చేకురుతుందని, కేసీఆర్ స్పూర్థితో మంథని నియోజవర్గంలోని అన్ని ప్రభుత్వ కళాశాలలో మధ్యాహ్న భోజనం పథకం పుట్ట లింగమ్మ ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్నమని అన్నారు. దీంతో ఎంతో పేద విద్యార్థులకు మేలు జరుగుతుందన్నారు. ట్రస్ట్ ద్వారా అందుతున్న సేవలను ఉపయోగించుకొని విద్యార్థులు కష్టపడి చదువుకొని ఉన్నతశిఖిరాలకు చేరుకొవలన్నారు. మధ్యాహ్న భోజనం పెడుతున్న జడ్పీ చైర్మన్ పుట్ట మధుకు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు మండల అధ్యక్షుడు అత్తె చంద్రమౌళి, సర్పంచ్ ఫోరం మండల అధ్యక్షుడు నూనె కుమార్, వైస్ ఎంపీపీ రవీందర్రావు, మచ్చుపేట సర్పంచ్ మేడగొని సతీష్ గౌడ్, నాయకులు పప్పు చంద్రమౌళి, కళాశాల ప్రిన్సిపాల్, ఆధ్యపకులు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed