- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
గాలివాన బీభత్సం.. అన్నదాత ఆగమాగం
by Kalyani |

X
దిశ, సైదాపూర్ : సైదాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో శనివారం సాయంత్రం గాలి వాన బీభత్సానికి భారీ వృక్షాలు నేలకొరిగాయి. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం రాశులు తడిసి ముద్దయ్యాయి. అలాగే ఆకునూరు గ్రామానికి చెందిన నెల్లి మొగిలి అనే వ్యక్తి నివాసగృహం నేలమట్టమైంది. అకాల వర్షానికి ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్ద అవ్వడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ఈ అకాల వర్షం అన్నదాతలకు తీవ్ర నష్టం కలిగించిందని రైతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆకునూరు నుంచి పెరకపల్లి వెళ్లే రహదారిలో వృక్షాలు నేలకొరిగాయి.
Next Story